Movies

మొన్న మురళి శర్మ, మరి నేడు సంపత్…ఇలా అయితే కష్టమే…!

అల వైకుంఠపురములో సినిమాలో అదరగొట్టిన మురళి శర్మ ఆ సినిమాకు భారీ పారితోషికం అందుకున్నాడు. ఎక్స్ స్ట్రా చేశా అని…. మరి భారీ పారితోషికం డిమాండ్ చేశాడనే టాక్ నడిచింది. మరి ఆ సినిమాలో అల్లు అర్జున్ తర్వాత మురళి శర్మదే హైలైట్ పాత్ర. అయితే తాజాగా మురళి శర్మలా మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ భారీ బడ్జెట్ సినిమాలో నటించడానికి భారీ పారితోషికం డిమాండ్ చేశాడట. అతనెవరో కాదు…..మిర్చి సంపత్. మిర్చి సినిమాలో సంపత్ విలనిజం పండించాడు.

అద్భుతమైన క్యారెక్టర్ పడటం సంపత్ అదరగొట్టడంతో బాగా హైలైట్ అయ్యాడు. అయితే కొరటాల శివ, చిరు సినిమాలో సంపత్ కీ రోల్ చేస్తున్నాడట. ఆ రోల్ చేయడానికి ఆచార్య టీమ్ ని సంపత్ భారీ పారితోషికం డిమాండ్ చేశాడనే టాక్ నడుస్తుంది. సంపత్ డిమాండ్ చేసిన ఫిగర్ చూసి నిర్మాతలు ఖంగుతిన్నారట. కానీ, సంపత్ మాత్రం డిమాండ్ ఉంది కాబట్టి ఇవ్వాల్సిందే అంటూ ఆచార్య నిర్మాతలను డిమాండ్ చేశాడట. అయితే సంపత్ మీద అంత పెడితే ఓకే నా అనే ఆలోచనలో ఆచార్య టీమ్ ఉన్నదట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."