Movies

ఆలీ షోలో ఆ సీనియర్ హీరోపై శివాజీ రాజా సెన్సేషనల్ కామెంట్స్!

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ షో అయినటువంటి “ఆలీతో సరదాగా” ప్రోగ్రామ్ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ మరో సరికొత్త ఎపిసోడ్ తో సిద్ధంగా ఉంది. ఐతే ఈసారి మన టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు మరియు మా అసోశేషియన్ లో కీలక అభ్యర్థి అయినటువంటి శివాజీ రాజా వచ్చారు.

ఈ మా విషయంలో శివాజీ రాజా గత కొన్నాళ్ల నుంచి కొంత మందిపై కాస్త గుస్సుగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన ఈ ప్రోమోలో మన టాలీవుడ్ కు చెందిన ఒక సీనియర్ హీరో మీదనే శివాజీ సంచలనం రేపే కామెంట్స్ చేసారు. ఓ చెప్తూ అతని సాటిస్పై చెయ్యడానికి ఇండస్ట్రీకు రాలేదని “ఆడు” అంటూ కూడా కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.

దీనితో మళ్ళీ టాలీవుడ్ లో శివాజీ మళ్ళీ మంచి హాట్ టాపిక్ అయ్యేలా ఉన్నారని చెప్పాలి. మరి శివాజీ రాజా ఎవరిని అన్నారో ఎందుకు అన్నారో తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ వచ్చే ఏప్రిల్ 6 సోమవారం టెలికాస్ట్ కాబోయే ఈ ఎపిసోడ్ ను మిస్సవ్వకుండా చూడాల్సిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."