Movies

మన హీరోల కెరీర్ లో పరమ చెత్త సినిమాల వెనుక కథ

కొన్ని సినిమాలు చూసాక ఫాన్స్ సైతం ఇలాంటి మూవీ చేయకుండా ఉంటె బాగుండేదేమో అని అనుకోవడం పరిపాటి. ఆలాంటి మూవీస్ మన స్టార్ హీరోలు చేసారు మరి. మెగాస్టార్ నటించిన శ్రీ మంజునాథ మూవీలో చిరంజీవికి పెద్దగా క్యారెక్టర్ లేదు. దానితో ఫాన్స్ బాగా నిరాశ చెందారు. అలాగే నాగార్జున నటించిన భాయ్ మూవీ పరమ చెత్త సినిమా. ఈ మూవీ గురించి నెగెటివ్ గా నాగ్ కామెంట్స్ చేయడమే ఇందుకు తార్కాణం. నందమూరి నటసింహం బాలయ్య నటించిన మూవీస్ లో విజయేంద్ర వర్మ,పల్నాటి బ్రహ్మనాయడు,పరమవీర చక్ర మూవీ మూడూ కూడా వరస్ట్ మూవీస్. ఎందుకంటే ఈ మూవీస్ ఇప్పటికీ బాలయ్యను ట్రోల్స్ చేయడానికి ఊతమిస్తున్నాయి. అంతగా ఈ మూవీస్ డిజాస్టర్ అయ్యాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ డిజాస్టర్ మూవీ అంటాం కానీ దాంతో పోలిస్తే,కొమరం పులి అసలు ఎందుకు తీసాడా అనిపిస్తుంది. ఎందుకంటే అజ్ఞాతవాసిలో పవన్ లుక్స్ పర్వాలేదు. కానీ కొమరం పులిలో పవన్ లుక్స్ లోనే తేడా కొట్టింది. తమిళ పద్దతికి అనుగుణంగా సాగింది. ఇక పంజా సినిమా కూడా డిజాస్టర్ అయినా, అందులో కూడా స్టైల్ ,లుక్స్ అదుర్స్ . ఇక మెహర్ రమేష్ తీసిన విక్టరీ వెంకటేష్ మూవీ షాడో మూవీలో వెంకీ పాత్ర అసలు బాగోదు. జనం కూడా బోర్ ఫీలయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన బ్రహ్మోత్సవం మూవీ పరమ బోర్ గా చెబుతారు. ఫాన్స్ కూడా అదే చెబుతారు. సినిమా 20నిమిషాలు చూసాక సినిమా మొత్తం అర్ధం అయిపొయింది. అసలు ఎందుకు మహేష్ అలా యాక్ట్ చేసాడో సెకండ్ ఆఫ్ చూసి చాలామంది కామెంట్స్ చేశారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో మెహర్ రమేష్ తీసిన శక్తి మూవీ చూస్తే ఇంత చెత్త మూవీ ఏంటి అనిపిస్తుంది. మణిశర్మ మంచి మ్యూజిక్ ఇచ్చినా,సినిమా మాత్రం మగధీర లెవెల్లో సాగింది. అసలు సినిమా స్క్రిప్ట్ దారుణం. ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ ని అసలు చూడలేం అన్నట్లుగా ఉంటుంది. బన్నీ విషయం తీసుకుంటే,వరుడు,బద్రీనాధ్ మూవీస్ దారుణంగా దెబ్బతిన్నాయి. 5రోజుల పెళ్లి కాన్సప్ట్ తో గుణశేఖర్ తీసిన వరుడు మూవీలో హీరోయిన్ ని చూపించకుండా తెరమీద చూడాలని అనడంతో శ్రీదేవి యాక్ట్ చేసిందేమో అనుకున్నారు. కానీ హీరోయిన్ పేలవంగా ఉండడం అసలు నచ్చలేదు. అలాగే వివి వినాయక్ నుంచి భారీ అంచనాల నడుమ వచ్చిన బద్రీనాధ్ సినిమాను కూడా ఫాన్స్ మగధీరతో పోల్చారు. సినిమాలో బన్నీ లుక్స్ బాగోలేదు. రామ్ చరణ్ మూవీస్ లో అతిచెత్త మూవీ వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను తీసిన ఈ మూవీ లో ఎమోషన్స్ అసలు లేవు. ఫైట్స్ అతకలేదు. ఇక ప్రభాస్ నటించిన పౌర్ణమి మూవీ దారుణంగా దెబ్బతింది. నిజానికి ప్రభాస్ బదులు ఓ చిన్న హీరోని పెట్టి తీస్తే సినిమా హిట్ అయ్యేదని అంటారు.