Movies

మహేష్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏమిటో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో మహేష్ మరోసారి తన సత్తా చాటాడు.ఈ సినిమా అందించిన విజయంతో తన నెక్ట్స్ మూవీని ప్రారంభించేందుకు మహేష్ రెడీ అయ్యాడు.

అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.దీంతో తన నెక్ట్స్ మూవీ కథను చాలా తీరిగ్గా సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డాడు మహేష్.వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది రద్దు అయ్యింది.దీంతో గీతాగోవిందం వంటి బ్లాక్‌బస్టర్ అందించిన పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేష్ ఓకే అన్నాడు.

ఇక పరశురాం ఇచ్చిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాను లాక్‌డౌన్ తరువాత వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేయాలని మహేష్ నిర్ణయం తీసుకున్నాడు.పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాకు పెద్ద సమయం కూడా పట్టదని మహేష్ అంటున్నాడు.ఈ సినిమాతో మరోసారి తన స్టామినాను బాక్సాఫీస్‌కు చూపించాలని మహేష్ భావిస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."