Movies

సుడి అంటే అల్లు అర‌వింద్ దే…అలా.. డ‌బ్బులు వ‌స్తూనే ఉన్నాయ్

సుడి అంటే అల్లు అర‌వింద్ దే. త‌న‌యుడి తో తీసిన `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్ అయ్యింది. టాప్ 2 లో నిలిచింది. చాలా చోట్ల బాహుబ‌లి రికార్డుల్ని కొట్టేసింది. ఈ సినిమాతో భారీ లాభాల్ని ఆర్జించారు అర‌వింద్‌. ఇప్పుడు రీమేక్ రూపంలోనూ మంచి డ‌బ్బులొస్తున్నాయి. ఇటీవ‌ల హిందీ హ‌క్కుల్ని రూ.7 కోట్ల‌కు అమ్మేశారు. అది చాలా మంచి మొత్తం. ఇప్పుడు త‌మిళ హ‌క్కులూ అమ్ముడుపోయాయి.

ఈ సినిమాని ఓ ప్ర‌ముఖ త‌మిళ నిర్మాత 3 కోట్లు వెచ్చించి కొనుక్కున్నాడు. ఈ త‌మిళ రీమేక్ లో శివ కార్తికేయ‌న్‌ని క‌థానాయ‌కుడిగా ఎంచుకుంటార‌ని టాక్‌. ద‌ర్శ‌కుడు, ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌ర‌గాల్సివుంది. హిందీలో బ‌న్నీ పాత్ర‌ని అక్ష‌య్ కుమార్ పోషిస్తున్నాడ‌ని టాక్‌. మొత్తానికి అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకి ఇప్ప‌టికీ డ‌బ్బులు వ‌స్తూనే ఉన్నాయి. హిట్ సినిమా తీస్తే అంతే క‌దా మ‌రి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."