Movies

తన లాస్ట్ క్రష్ ఎవరో బయటపెట్టిన వరుణ్ తేజ్..!

గత ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేశ్‌ సినిమాతో మంచి సక్సెస్ మీద ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ తన లాస్ట్ క్రష్ ఎవరో బయటపెట్టాడు. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్ కారణంగా అన్ని సినిమాల షూటింగ్‌లు ఆగిపోవడంతో సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు ఎక్కువగా కనబడుతున్నారు.

ఈ నేపధ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ ట్విటర్‌లో #AskVarun అనే హ్యాష్ ట్యాగ్‌తో నీ లాస్ట్ క్రష్ ఎవరు వరుణ్ అని అడుగుతాడు. అయితే దీనికి వరుణ్ గ్రేట్ ఎస్కేపింగ్ సమాధానం ఇచ్చాడు. నా లాస్ట్ క్రష్ నా లాస్ట్ మూవీ డైరెక్టర్ అంటూ బదులిచ్చాడు. అయితే వరుణ్ ఇచ్చిన ఈ సమాధానం చాలా తెలివిగా ఉండడంతో సోషల్ నెటిజన్లు వాటే ఎస్కేప్ వరుణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.