చిరంజీవి తండ్రి ఒడిలో గల మెగా హీరో ఎవరో గుర్తు పట్టారా?
కంటికి కన్పించని శత్రువుగా మారిన కరోనా మహమ్మారితో లాక్ డౌన్ పొడిగించడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్‌తో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలందరూ ప్రజలను చైతన్యవంతం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు అప్పటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ దానికో క్యాప్షన్ ఇస్తున్నారు.
తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన చిన్ననాటి ఫొటోతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు. ఇటీవల వరుణ్ తేజ్ రీసెంట్‌గా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించి, అలాగే తను నటించబోయే సినిమాలకు సంబంధించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు వరుణ్ తేజ్ ఈ చిట్ చాట్‌లో తనదైన తరహాలో సమాధానాలు ఇచ్చారు.
తన తాతా వెంకట్రావుతో కలిసి ఓ విమానంలో వెళుతున్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘మంచి పాత జ్ఞాపకాలు.. మా తాతయ్యతో’ అంటూ ట్వీట్ చేసాడు. తాతయ్య కొణిదెల వెంకట్రావు ఒడిలో చిన్ననాటి వరుణ్ తేజ్ కూర్చుని ఉన్నఅరుదైన ఈ ఫొటో ను వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసాడు. ఈ ఫొటోలో చిరంజీవి తండ్రి వెంకట్రావు విమాన ప్రయాణంలో ఉండగా వరుణ్ తేజ్‌ను తన ఒడిలోకి తీసుకుని ముద్దాడుతున్నారు. వరుణ్ తేజ్ ఈ పిక్‌ను పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

