మెగా అల్లుడు పరిస్థితి ఏమిటి…అక్కడికి వెళ్ళితే లక్ మారుతుందా…!
మెగా అల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కళ్యాణ్ దేవ్ తన తొలి చిత్రం ‘విజేత’తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు.కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలవడంతో కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపలేదు.
కాగా చాలా సమయం తరువాత ఆయనతో ఓ సినిమా తెరకెక్కించేందుకు పులి వాసు అనే డైరెక్టర్ ముందుకు వచ్చాడు.‘సూపర్ మచ్చి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో రియా చక్రవర్తి మరియు రచితా రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కళ్యాణ్ దేవ్ చిత్రం తెలుగులో హిట్ అయితే ఆ తరువాత వేరే భాషల్లో రిలీజ్ చేస్తే బెటర్ అని పలువురు సినీ విమర్శకులు అంటున్నారు.మరి ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎంత కాన్ఫిడెంట్‌గా లేకపోతే రిలీజ్‌కు ముందే సినిమాను ఇతర భాషలో కూడా రిలీజ్ చేయనుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
