Movies

లాక్ డౌన్ సమయంలో నమ్రత ఏమి చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక సెలబ్రెటీలు కూడా ఇంటికే పరిమితం అయిపోయారు. ఇన్నాళ్లూ బిజీగా గడిపిన సమయాన్ని తలచుకుంటూ,ఇప్పుడు అనుకోకుండా వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంట్లో చేసే వంటల వీడియోలను, వర్క్ ఔట్ వీడియోలను, డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు. కొందరు సెలబ్రెటీలు ఇన్ని రోజులు తమలో దాగున్న టాలెంటు బయటపెడుతున్నారు. మరికొందరు కరోనా వల్ల కావాల్సినంత సమయం దొరకడంతో తమ ప్రతిభకు సాన పెడుతున్నారు. ఇక లాక్ డౌన్ వల్ల దొరికిన ఈ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కొత్త స్కిల్స్ నేర్చుకుంటోంది.

ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నమ్రతా శిరోద్కర్ ఒకప్పుడు టాప్ మోడల్. మహేశ్ తో చేసిన ‘వంశీ’ చిత్ర పరిచయంతోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి అది పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత మోడలింగ్ నటనకు స్వస్తి పలికి ఇంట్లో ఇల్లాలిగా మారిపోయారు. భర్త పిల్లల బాగోగులు చూసేందుకు సమయాన్ని కేటాయించింది. అంతేకాకుండా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతోంది. ఈమె పేరుకి తగ్గట్టుగానే ఎంతో వినమ్రతతో ఉంటుందని ఇండస్ట్రీలో అందరూ చెప్తుంటారు నమ్రత తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత తనలో చాలా చేంజ్ వచ్చిందని మహేష్ అనేక సందర్భాల్లో చెప్తూనే వస్తున్నాడు. మహేష్ బాబుకి సంబంధించిన అన్ని విషయాల్లో నమ్రత జోక్యం చేసుకుంటూ భర్తకి అండగా నిలుస్తూ వస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు అన్ని వ్యాపారాల్లో అడుగుపెట్టడానికి కూడా నమ్రతా నే కారణమని ఇండస్ట్రీలో అందరూ అంటుంటారు.

.ఇక సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ నమ్రత గురించి ఎలాంటి విమర్శలు వినపడలేదు. ఏ వివాదంలోనూ లేదు. పెళ్లి తర్వాత తన సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పి పూర్తిగా కుటుంబ బాధ్యతలకే పరిమితమైన నమ్రత అంటే అందరికి గౌరవం ఎక్కువే. ఇప్పుడు లాక్ డౌన్ తో అనుకోకుండా వచ్చిన సమయాన్ని ఎప్పటి నుంచో నేర్చుకోవానుకుంటున్న స్టిచ్చింగ్ ,ఎంబ్రాయిడరీ స్కిల్స్ మీద వెచ్చిస్తోంది. ఇందుకోసం తన ఫ్రెండ్స్ తో కలిసి ఆన్ లైన్ క్లాసులలో జాయిన్ అయిందట. ఈ విషయం తెలిసిన వారు సూపర్ స్టార్ వైఫ్ అయ్యుండి ఇలాంటివి కూడా నేర్చుకుంటోందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."