Healthhealth tips in telugu

చలికాలం ఉదయాన్నే తేనెలో యాలకుల పొడి కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Cardamom And Honey Benefits In telugu : చలికాలం మొదలైందంటే చాలు.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటి సమయంలో మన వంటింట్లోనే ఉండే తేనె మరియు యాలకుల పొడి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి!

ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనెలో చిటికెడు యాలకుల పొడి కలిపి తీసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు:

యాలకులు, తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి రోజు ఒక స్పూన్ తేనెలో పావు స్పూన్ యాలకుల పొడిని కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
cardamom
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాలకులలో అనేక రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. తేనెలో రోగనిరోధక శక్తిని పెంచే అనేక సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి. ఈ సీజన్ లో వచ్చే దగ్గు, జలుబు, గొంతునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాకుండా నోటి దుర్వాసన సమస్యను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తేనె,యాలకుల్లో ఉండే పోషకాలు గుండెను దృఢంగా ఉంచడానికి మరియు వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
gas troble home remedies
తేనె,యాలకుల మిశ్రమాన్ని భోజనం అయ్యాక తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచి గ్యాస్,కడుపు ఉబ్బరం,అజీర్ణం వంటి సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మరియు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.

తేనె,యాలకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్ నివారించడంలో చాలా సహాయపడుతుంది. కాబట్టి తేనె,యాలకుల మిశ్రమాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."