Movies

మెగా డాటర్ కి సంబంధం చూడ్డంలో కీలక పాత్ర ఎవరిదో తెలుసా ?

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ ఫ్యామిలీలో ఏ చిన్న శుభకార్యం జరిగినా అభిమానులకు పండగే . ఈ ఈనేపధ్యంలో మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహం ఖరారు అయ్యింది. ఏపీకి చెందిన ఐపీఎస్‌ అధికారి కొడుకు చైతన్యతో నిహారిక పెళ్లి జరిపించేందుకు పెద్దలు ఒప్పందం చేసుకున్నారు. ఆగస్టులో వివాహ నిశ్చితార్థం, వచ్చే ఏడాది ఆరంభంలో పెళ్లి అంటూ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడే మరో చర్చకు దారితీసింది. విషయం ఏమిటంటే, నిహారికది ప్రేమ వివాహమా లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లా అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఇలా చర్చకు దారితీసిన నేపథ్యంలో నిహారిక పెళ్లి వ్యవహారం పూర్తిగా పెద్దలు కుదిర్చిన సంబంధమేననని అంటున్నారు. ఈ వివాహంకు ప్రధాన సూత్రధారి కూడా మెగాస్టార్ చిరంజీవి అని టాక్ వినిపిస్తోంది. చైతన్య తల్లి పద్మ తండ్రి వెంకటరత్నం అలాగే చిరంజీవి తండ్రి వెంకటరావు మంచి మిత్రులు.వారిద్దరు చనిపోయిన తర్వాత కూడా ఆ రెండు కుటుంబాల మద్య స్నేహ బంధాన్ని చిరంజీవి కొనసాగిస్తూ వచ్చాడు.

పద్మ గారిని చిరంజీవి ఆప్యాయంగా పలకరించడంతో పాటు సొంతింటి మనిషిగా చూసుకునే వారు.అలా రెండు ఫ్యామిలీల మద్య గడచిన అయిదు దశాబ్దాల కాలంగా స్నేహం కొనసాగుతోంది. ఈ నేపదంలోనే పద్మ కొడుకు చైతన్యకు, నాగబాబు కూతురు నిహారికకు పెళ్లి చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన చిరంజీవి చేసిన వెంటనే ఆమె సంతోషంగా ఓకే చెప్పేశారట. ఇంకేముంది నాగబాబు కూడా చైతన్య పట్ల పాజిటివ్ గా ఉండడం వలన లైన్ క్లియర్ అయింది. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకోవడం నిహారికకు చైతన్య, చైతన్యనకు నిహారిక నచ్చడంతో పెళ్ళికి రెడీ అయింది. సో అదండీ సంగతి .