Movies

2021 సంక్రాంతికి స్టార్ హీరోలు వచ్చే పరిస్థితి ఉందా…?

కరోనా కారణంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎవరు షూటింగ్స్ రావటం లేదు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా వారు అసలు ముందుకి రావటం లేదు. స్టార్ హీరోలను అనుసరించి యంగ్ హీరోలు కూడా ఎవరు ముందుకు రావటం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గేవరకూ అలాగే వాక్సిన్ వచ్చేవరకు షూటింగ్స్ వచ్చే ఉద్దేశం ఎక్కడ కనపడటం లేదు చాలా మంది 2021 వరకు షూటింగ్స్ జరగవనే అభిప్రాయానికి వచ్చేసారు.

దాంతో అభిమానులు తమ అభిమాన హీరోలు సంక్రాతి బరిలో ఉండరని ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ప్రభాస్, బన్నీ, మహేష్ సైతం తమ చిత్రాల విడుదల సంక్రాంతికి చేయలేని పరిస్థితి ఉంది. కనీసం రెండు నెలల తరువాతైనా సాధారణ పరిస్థితులు ఏర్పడితే బాలయ్య, చిరు మరియు పవన్ కళ్యాణ్ సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉంటుంది.