Movies

ఒక్కప్పటి ఈ విలన్ గుర్తు ఉన్నాడా…ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా ?

ఫైటర్ గా సినీ పరిశ్రమకు వచ్చి విలన్ గా స్థిరపడిన పొన్నంబళమ్ గురించి మనలో చాలా మందికి తెలిసిన విషయమే. తెలుగులో కూడా ఆయన చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల సినిమాలో విలన్ గా నటించి తెలుగు వారిని కూడా మెప్పించాడు. 90లలో విలన్ గా పొన్నాంబళం బాగా ఫేమస్. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమి బాగోలేదు. కిడ్సీ సమస్యతో బాధపడుతున్న పొన్నంబళమ్ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొన్నాంబళం చికిత్సకు కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్నారట.

ఈ విషయం తెలుసుకున్న కమల్ హాసన్ అతడికి ఆర్ధిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అతడి పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. కమల్ హాసన్ తో కలిసి చాలా సినిమాల్లో నటించారు. రజనీకాంత్ తో కూడా కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఒకప్పుడు చేతిలో ఖాళీ లేకుండా సినిమాలు చేసిన ఈ కమెడియన్ పరిస్థితి ఇప్పుడు ఇలా అయింది. సంపాదన అంతా ఖర్చు పెట్టకుండా కాస్త వెనకేసుకుంటే ఇలాంటి పరిస్థితిరాదు .