Kitchenvantalu

రోడ్ సైడ్ బండి మీద దొరికే వేడి వేడి మసాలా వడలు.. ఇంట్లోనే సులభంగా!

చల్లటి వాతావరణంలో లేదా సాయంత్రం టీ సమయంలో వేడి వేడిగా, కరకరలాడుతూ ఏదైనా స్నాక్ తినాలనిపిస్తోందా? అయితే మన అందరికీ ఎంతో ఇష్టమైన, ఎంతో రుచికరమైన శనగల వడలు (మసాలా వడలు) ట్రై చేయాల్సిందే!

ఈ వీడియోలో, బండి మీద దొరికే స్టైల్ లో బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే శనగల వడలను ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను.

వడలు నూనె పీల్చకుండా, విడిపోకుండా పర్ఫెక్ట్ గా రావాలంటే పిండిని ఎలా రుబ్బుకోవాలి, ఏమేమి వేయాలి అనే చిన్న చిన్న సీక్రెట్ టిప్స్ కూడా ఉంటాయి.

కావలసిన పదార్ధాలు
నానబెట్టిన శనగలు – కప్పు
ఉల్లితరుగు – కప్పు
అల్లం ముక్కలు – 2 స్పూన్స్
పచ్చిమిర్చి – 5
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టీ స్పూను
కరివేపాకు
నూనె – సరిపడ

తయారి విధానం
ముందురోజు రాత్రి శనగలను నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం నీరంతా వంపేసి శనగలు, పచ్చిమిర్చి, ఉప్పుజీలకర్ర వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉల్లితరుగు, అల్లం ముక్కలు,కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి.

తర్వాత స్టౌ మీద పాన్ ఉంచి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగాక మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా ఒత్తుకుని నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే శనగల వడలు రెడీ . ఈ వానాకాలంలో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఈ వేడి వేడి వడలను ఉల్లిపాయ ముక్కలతో లేదా మీకిష్టమైన చట్నీతో తింటే ఆ మజాయే వేరు!

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."