కేవలం 2 నిమిషాల్లో పసుపు పళ్ళు ముత్యాల్లా మెరవాలంటే ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు!
yellow teeth Home remedies :నలుగురిలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా నవ్వాలంటే పసుపు పళ్ళ (Yellow Teeth) వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? ఎన్ని రకాల పేస్టులు వాడినా, ఎంత బ్రష్ చేసినా దంతాల మీద గార, పసుపుదనం పోవడం లేదా?
టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, సరైన ఓరల్ కేర్ తీసుకోకపోవడం వల్ల పళ్ళు పసుపు రంగులోకి మారుతుంటాయి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి కెమికల్స్ వాడకుండా మన వంటగదిలో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే కేవలం 2 నిమిషాల్లో పసుపు పళ్ళను ముత్యాల్లా ఎలా మెరిపించవచ్చో ఈ రోజు మీకు తెలియజేయబోతున్నాం.

ముఖంలో పళ్ళు అందాన్నిస్తాయి ముత్యాల్లాంటి పళ్ళు ఉండాలని చాలామంది కోరుకుంటారు మనం నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ముత్యాల్లాంటి పలువరస కనబడితే ముఖం అందంగా కనబడుతుంది. అలాగే ఎదుటివారు కూడా మాట్లాడటానికి ఇష్టపడతారు.
Also Read: Instant Face Glow: పార్లర్ కు వెళ్లే పనిలేదు.. కాఫీ, అలోవెరాతో తెల్లగా మెరిసిపోయే ముఖం మీ సొంతం!
కానీ ఈ రోజుల్లో చాలామంది పళ్ళు తెల్లగా లేకుండా పసుపురంగులో గార పట్టినట్టు ఉంటున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే ఇప్పుడు ఇంటి చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. చిగుళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండటమే కాకుండా పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి..
ఒక బౌల్ లో 4 వెల్లుల్లి రెబ్బలను మెత్తని పేస్ట్ చేసి దానిలో ఒక స్పూన్ టమోటా రసం,కొంచెం టూత్ పేస్ట్,పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి బ్రష్ తో పళ్లను 2 నిమిషాల పాటు తోమాలి. ఈ విధంగా వారంలో 3 సార్లు చేస్తే పళ్ల మీద ఉన్న గార,పసుపు తొలగిపోయి తెల్లగా మెరిసిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

