Movies

ఈ సినిమాలు ఎందుకు ఆడలేదు….ఒక లుక్ వేయండి

మనం చాలా సినిమాలు చూస్తాం. కానీ ఎక్కడో కొన్ని మిస్సవుతూనే ఉంటాం. అలాంటివి చాలానే ఉంటాయి. ఎందుకంటే అందరికీ అన్నీ చూడ్డం కుదరదు కదా. అలాంటి మూవీస్ లోకి వెళ్తే,.. రౌడీ ఫెలో మూవీ ఇగో ని టచ్ చేసే అంశం. ఈ సినిమా మొత్తం హీరో ఇగో మీద వెళుతుంది. ఇందులో ఒక్కో డైలాగ్ అదిరిపోతోంది. ఇగో హర్ట్ ఐతే ఎంతవరకూ అయినా వెళ్తారు. నారా రోహిత్ ఈ పాత్రలో అదరగొట్టాడు. గొల్లపూడి పలికే డైలాగ్స్ సూపర్భ్. పరుచూరి డైలాగ్స్ సూపర్ గా రాసారు.

ఇక కొన్ని అనివార్య కారణాల వలన జగడం మూవీని సూపర్ స్టార్ మహేష్ చేయలేకపోయాడు. ఇందులో తమ్ముడి పాత్ర రామ్ పోతినేని చేయాలి. కానీ రామ్ హీరోగా చేసేసాడు. 18 ఏళ్లకే రామ్ ఈ మూవీ చేసాడు. అదే ఓ స్టార్ హీరో చేసి ఉంటే మరోలా ఉండేది. ఎందుకంటే ఇలాంటి సినిమా ఎందుకు తనకు రాలేదా అని రాజమౌళి అనుకోవడమే కాదు,పవన్ కళ్యాణ్ తో ఆ సీన్ చేసి ఉంటే భలే ఉండేది అని కూడా డైరెక్టర్ సుకుమార్ దగ్గర కామెంట్ చేసాడు. రంగస్థలం ఒక్కటే కాదు జగడం కూడా సుకుమార్ చేసిన అన్నదమ్ముల సెంటిమెంట్ మూవీయే.

నేచురల్ స్టార్ నాని ఈమధ్య చేసిన జెర్సీ మూవీ చూసి ఎమోషనల్ గా ఫీలవుతూ ఉంటాం. కానీ అప్పట్లోనే భీమిలి కబడ్డీ జట్టు మూవీ వచ్చింది. కెరీర్ బిగినింగ్ లోనే నాని అదరగొట్టేసాడు. జెర్సీ,భీమిలి కబడ్డీ జట్టుకి బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ . కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో భీమిలి కబడ్డీ జట్టు మూవీలో నాని నటన సూపర్. కామెడీ,లవ్,ఎమోషన్,స్పోర్ట్స్ అన్నీ కలగలిపిన మూవీ ఇది.

సాంకేతిక విలువలతో తీసిన మూవీ నందనవనం 120కిలోమీటర్లు.. గురించి చాలామందికి తెలీదు. షటర్ ఐలాండ్ ఆంగ్ల మూవీ చూసిన వాళ్ళకి దీని గురించి తెలుస్తుంది. ఇందులో హీరో దొంగ. ఓరోజు కోట శ్రీనివాసరావు కల్సి నేను నందనవనంలో పనిచేస్తున్నా. అచ్చం నీలానే మా ఓనర్ ఉంటాడు. నీ సంతకాలు కావాలి. నీకు కావాల్సినంత డబ్బిస్తా అని తీసుకెళ్తాడు. తీరా ఎస్టేట్ కి వెళ్ళాక ఏమైంది అనేది కథ. లో బడ్జెట్ లో తీసిన ఈ సినిమా 2006లో వచ్చింది. ఇందులో ట్విస్ట్ భలే ఉంటుంది.

నారా రోహిత్ మంచి సినిమాలు చేసాడు. అందులో అసుర ఒకటి. ఎసిపి ధర్మ … ధర్మాన్ని కాపాడే ఓ జైలర్. స్ట్రిక్ట్ గా ఉండడం వలన అందరూ డిపార్ట్ మెంట్ లో అతడిని రాక్షసుడిలా భావిస్తారు. అందుకే టైటిల్ అలా పెట్టారు. హత్యకేసులో జైలుకొచ్చిన చార్లీ కి ఉరి శిక్ష పడుతుంది. తప్పించుకోడానికి ప్రయత్నం చేస్తాడు. ధర్మ ఆపడమే ట్విస్ట్ లతో ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."