Beauty Tips

కాకరకాయ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా….ఎలానో చూడండి

కాకరకాయ చేదుగా ఉన్నా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కాకరలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి కాకుండా బ్యూటీ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ చిట్కాలను తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినరు. అటువంటివారు ఈబ్యూటీ చిట్కాలను ఫాలో అయితే అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

కాకరకాయ రసాన్ని ముఖానికి రాసి 2 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీద ఉన్న నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

కాకరకాయ పేస్ట్‌లో కరివేపాకు పొడి వేసి కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మొటిమల సమస్య చాలా వరకూ తగ్గుతుంది.

కాకరకాయ సగం ముక్కని తీసుకుని పేస్ట్‌లా చేయాలి. ఇందులో జాజికాయ పొడి, పెరుగు కలిపాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్‌లా వేయాలి.కొద్దీ సేపటి తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా వరుసగా కొన్ని రోజులు చేస్తుంటే మొటిమలు, మచ్చల సమస్య పూర్తిగా తగ్గుతుంది. జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."