Movies

అకిరా హీరోగా ఎంట్రీ ఇస్తాడా…అసలు సినిమాల ఆలోచన లేదా ?

మెగాస్టార్ చిరంజీవి సోదరునిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ కి గల ఫాన్స్ మాములు రేంజ్ లో ఉండరు. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా పవన్ మూవీస్ పిచ్చిపిచ్చిగా చూసేవాళ్ళు బోల్డంతమంది ఉన్నారు.

అందరి హీరోల పిల్లలు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో పవన్ ,రేణు దేశాయ్ లకు పుట్టిన అకిరా నందన్ కూడా హీరోగా వస్తాడా రాడా చర్చలు జోరుగానే సాగుతున్నాయి. నిజానికి రేణుతో విడిపోయి వేరే పెళ్లి చేసుకున్నప్పటికీ కొడుకు అకిరా, కూతురు ఆద్య లతో పవన్ తో పాటూ మెగా ఫ్యామిలీ మొత్తం ఆప్యాయంగానే ఉంటుంది పవన్ మాదిరిగా హైట్ గా ఉండే అకిరా ఎప్పుడూ సినిమా ప్రస్తావన తెచ్హిన దాఖలాలు లేవు.

పైగా అమ్మ పక్కన నిలబడిన ఫొటోలతోనే సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. పంజా సినిమా నుంచి అడవి శేష్ తో ఫ్రెండ్ లా ఉంటున్నాడు. తనకు ఎంతోఇష్టమైన అడివి శేష్ కి అకిరా మంచి మాస్క్ లను గిఫ్ట్ గా పంపించాడట. ఈవిషయాన్ని అడవి శేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ,అకిరా మంచి మనసుని మెచ్చుకున్నాడు. అయితే అకిరా ఎంట్రీ గురించి కూడా అడవి శేష్ చెబుతాడేమో అని ఎదురుచూస్తున్నారు ఫాన్స్ .