Movies

సిరివెన్నెల కొడుకు టాలీవుడ్ హీరో…ఎవరో వెంటనే చూసేయండి

సినిమా రంగంలోకి వచ్చి,స్టార్స్ అవ్వాలని చాలామంది కలగంటారు. పెద్దయ్యాక హీరో అవ్వాలని ఉందని చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అయితే అందరికీ సినిమా రంగం ఛాన్స్ రాదు. ఒకవేళ వచ్చినా నిలబడడం కూడా చాలా కష్టం. కొందరు రాత్రికి రాత్రే స్టార్స్ అయినవాళ్లు ఉన్నారు. కొందరు వెనుదిగిన వాళ్ళూ ఉన్నారు. ఇంకొందరు ఏదో ఒక పాత్రతో నెట్టుకొస్తుంటారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు ఇలా వచ్చి అలా స్టార్ అయిపోయినవాళ్లు ఉన్నారు. కొందరు టెక్నీషియన్స్ గా, మరొకొందరు సపోర్టింగ్ ఆర్టిస్టులుగా సినీ వారసత్వంతో రాణించేవాళ్ళు ఉన్నారు.

‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి అనగానే గొప్ప గీతరచయిత కళ్ళముందు కనిపిస్తారు. సిరివెన్నెల సినిమాలో పాటలతో పాపులరై ,అదే సినిమాను ఇంటిపేరుగా మార్చుకున్న సీతారామ శాస్త్రి కలం నుంచి ఎన్నో హిట్ సాంగ్స్ పుట్టాయి. ఒక పాట వింటే చాలు అందులోని సాహిత్యాన్ని బట్టి అది రాసింది సిరివెన్నెల అని చెప్పేయొచ్చు. ఈయన గాయం సినిమాలో విలేకరి పాత్రలో వెండితెరపై కూడా మెరిశారు. బహుశా ఆ పాత్ర కారణంగానే ఆయన కొడుకు కూడా సినిమా రంగంలో నటుడిగా రాణిస్తున్నాడా అనిపిస్తుంది.

అసలు ఇతన్ని చూస్తే ,సిరివెన్నెల కొడుకు అని ఎవరూ అనుకోరు కూడా. ఎందుకంటే నెగెటివ్ రోల్స్ లో కూడా అదరగొట్టేస్తున్నాడు. తండ్రి పేరు వాడుకోకుండా తనదైన టాలెంట్ తో సినిమా రంగంలో రాణిస్తున్నాడు. ఫిదా సినిమాలో హీరో వరుణ్ తేజ్ కి అన్న పాత్రలో నటించిన రాజా చేంబోలు. ఎవడు మూవీలో రామ్ చరణ్ కి ఫ్రెండ్ రోల్ వేసాడు. ఏబీసీడీ మూవీలో యువజన నాయకుడిగా నటించాడు. మిస్టర్ మజ్ను ,అంతరిక్షం, ఇద్దరిలోకం ఒక్కటే ,అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు భానుమతి రామకృష్ణ మూవీలో చేసాడు. ఫిలిం బ్యాక్ గ్రౌండ్ గురించి ఏనాడు చెప్పుకోలేదు. పాత్ర ఎలాంటిదైనా చేయడానికి రెడీ అనిచెప్పే యితడు టాలెంట్ ని నమ్ముకుని దూసుకెళ్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."