Movies

సర్కారువారిపాటకు అడవి శేష్ అడ్డంకి నిజమేనా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారువారి పాట సినిమా ప్రకటించడం ,సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున పోస్టర్ కూడా రావడం తెల్సిందే. పరశురామ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్స్ కి అనుమతి వచ్చినప్పటికీ కరోనా కేసుల పెరుగుదలతో చాలామంది అగ్ర హీరోలు బయటకు రావడం లేదు.

ఇక మహేష్ బాబు కూడా అప్పుడే వద్దులే అన్నట్లుగానే ఉన్నాడు. అన్నీ తగ్గాక చూద్దాం ,భౌతిక దూరం,మాస్క్ తో సినిమా అవ్వడం కష్టం. వాక్సిన్ వచ్చాక అన్నట్లుగా హీరోలున్నారు. అయితే మహేష్ బాబు కేవలం కరోనా ఎఫెక్ట్ ఒక్కటే కాకుండా అంతకుముందు చేపట్టిన ప్రాజెక్ట్ పూర్తిచేసాకే సర్కారువారి పాట చేయాలని భావిస్తున్నట్టు టాక్. మహేష్,నమ్రత కల్సి అడవి శేష్ హీరోగా మేజర్ మూవీ స్టార్ట్ చేసి చాలా వరకూ తీసాక లాక్ డౌన్ తో ఆగిపోయింది.

కరోనా ఎఫెక్ట్ తగ్గాక ముందుగా ఈ ప్రాజెక్ట్ చేసేసి ఆతర్వాత తన ప్రాజెక్ట్ లోకి వెళ్లాలని మహేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం బాలన్స్ షూటింగ్ కోసం ఏర్పాట్లు చేయడం,షూటింగ్ కూడా కొంత పూర్తయ్యాక యూనిట్ మెంబర్స్ కి పాజిటివ్ రావడంతో అందరిని క్వారంటైన్ కి పంపేసి ప్రాజెక్ట్ ఆపేశారట. మేజర్ సినిమా అయ్యాక చేద్దామనుకుంటే ఇలా అయింది. అందుకే ఇప్పట్లో షూటింగ్ కి దూరంగానే ఉండాలని మహేష్ బాబు గట్టిగానే నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."