నాని కెరీర్ లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసా ?

ఒక యాక్టర్ గానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ సాధించిన హీరో నాని తక్కువ కాలంలో ఎక్కువ అభిమానం పొంది నేచురల్ స్టార్ గా ఎదిగాడు. నిజానికి బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వాలనుకున్న నాని ఏకంగా వెండితెరపై వెలుగుతున్నాడు. కొత్తగా నెగెటివ్ షెడ్ లో చేసిన ‘వి’ మూవీ ఓటిటిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకూ 23మూవీస్ చేయగా అందులో 4బ్లాక్ బస్టర్ అయ్యాయి. 7హిట్స్,7ఏవరేజ్ ,4ప్లాప్ లతో సక్సెస్ హీరోగా రాణిస్తున్నాడు. నవీన్ బాబు గంటా టాలీవుడ్ లో నాని గా ఎంట్రీ ఇచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూనే హీరోగా ఛాన్స్ కొట్టేసాడు. 2012లో పెళ్లాడాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

కాగా 2008లో అష్టా చెమ్మాతో హీరోగా మంచి నటన కనబరిచిన నాని తొలిహిట్ అందుకుని కెరీర్ లో దూసుకెళ్తున్నాడు. 2009లో రైట్ సినిమా యావరేజ్ గా నిల్చింది. అదే ఏడాది స్నేహం మూవీ ప్లాప్ అయింది. 2010లో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు యావరేజ్ అయింది. అలా మొదలైంది మూవీ భారీ హిట్ ఇచ్చింది. తర్వాత2011లో పిల్ల జమిందార్ పెద్దగా ఆడలేదు. ఇక 2012లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ఈగ మూవీలో తక్కువ సేపు యాక్ట్ చేసిన మంచి పేరు రావడమే కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే ఏడాది ఎటో వెళ్ళిపోయింది మనసు అంటూ గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ ఏవరేజ్ అయింది.

ఇక 2013లో డి ఫర్ దోపిడీ, 2014లో వచ్చిన పైసా మూవీ ప్లాప్ అయ్యాయి. 2015లో జెండాపై కపిరాజు యావరేజ్ గా నిల్చింది. తర్వాత వచ్చిన ఎవడె సుబ్రహ్మణ్యం కూడా ఏవరేజ్ అయింది. తర్వాత భలే భలే మగాడివోయ్ మూవీ తో సూపర్ హిట్ కొట్టాడు. అక్కడ నుంచి వరుస హిట్స్ పడ్డాయి. కృష్ణగాడి వీర ప్రేమ గాథ,జెంటిల్మెన్ ,మజ్ను మూవీస్ మంచి హిట్ ఇచ్చాయి. 2017లో నేను లోకల్,నినుకోరి,మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీస్ తో స్టార్ హీరోగానే తన సత్తా చాటాడు. కృష్ణార్జున యుద్ధం,దేవదాస్ మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. ఇక జెర్సీ మూవీతో నాని నటనకు అద్దంపట్టింది. 2019లో వచ్చిన నానీస్ గ్యాంగ్ లీడర్ ఏవరేజ్ అయింది.