Movies

ఈ స్టార్ హీరో పిక్ భలే వైరల్ అవుతోంది…ఎవరో గుర్తు పట్టారా….?

మాస్ మహారాజు రవితేజ హిట్ కోసం పరితపిస్తూ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నాడు. అతడి కెరీర్ లో ఇది 66వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈమూవీలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మహమ్మారి కరోనా సమయంలో వాయిదా పడింది. శృతి హాసన్ – వరలక్ష్మి శరత్ కుమార్ – సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఇక ‘క్రాక్’తో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో ‘రాక్షసుడు’ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు.

ఈ యాక్షన్ థ్రిల్లర్ హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో యువ హీరో కోనేరు హవీష్ నిర్మించనున్నారు. అంతేకాకుండా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయబోతున్న ట్లు టాక్. అయితే కరోనాతో షూటింగ్స్ కేన్సిల్ కావడంతో సినిమా షూటింగ్స్ లేకపోవడంతో హీరోలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎప్పుడూ బిజీగా ఉండే లైఫ్ లో అనుకోకుండా దొరికిన ఆ సమయాన్ని ఫ్యామిలీ కోసం కేటాయిస్తున్నారు. ఇక రవితేజ కూడా ఈ క్వారంటైన్ టైంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా లాక్ డౌన్ లో రవితేజ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే సినిమాలు లేవని ఫిట్నెస్ ని అశ్రద్ధ చేయకుండా రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ ఫిజిక్ కోసం రవితేజ కష్టపడుతున్నాడు.కండలు తిరిగిన దేహంతో యువ హీరోలకు పోటీ ఇచ్చేలా రవితేజ తయారయ్యాడు. ఇప్పటికే జిమ్ కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయడమే కాదు, తాజాగా ‘క్రష్ ది చీట్ డే’ అంటూ మరో ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసాడు. జిమ్ లో దిగిన ఓ స్నాప్ ని స్టోరీగా పెట్టాడు. అయితే ఈ ఫొటోలో రవితేజ రెండు చేతులతో డంబెల్స్ పట్టుకున్నదే కానీ, ఫేస్ మాత్రం కనిపించకుండా ముసుగేసుకుని ఉండడంతో ఈ మాస్ హీరో ఎవరో కనుక్కోండి చూద్దాం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."