Movies

మెగా మేనల్లుడు సినిమాకి OTT భారీ ఆఫర్.. కానీ వద్దన్నారట….కారణం ఇదే !

ఇక కరోనా కాలం. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. అందరూ ఓటిటి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఒక కొత్త హీరో సినిమాకి 10 కోట్లు పైబడిన బిజినెస్ వస్తే అది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న వైష్ణవ్ తేజ్ తొలి సినిమాకే ఏకంగా 13కోట్ల మేర ఓటీటీ ఆఫర్ ఇచ్చారట. అయినా సరే, ఓటీటీ రిలీజ్ కి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నో చెప్పేశారని టాక్. ఉప్పెనను ఎట్టిపరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ చేయాలనే పట్టుదలే ఇందుకు కారణం.

ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు.ఈ క్రేజీ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అందుకే ఇప్పటికే ఉప్పెన పాటలు పెద్ద సక్సెసయ్యాయి. తమిళ టాప్ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన విలన్ గా చేసినందుకు పారితోషికం భారీగానే ఇచ్చారు. కొత్త జంట పెర్ఫామెన్స్ అదరగొడుతోంది. ముఖ్యంగా కృతి శెట్టి అందచందాలకు కాలేజ్ కుర్రకారు ఖుషి అవుతున్నారు. అందుకే ఈ సినిమా 100 పర్సంట్ లవ్ రేంజులో పెద్ద హిట్ అవుతుందని అంచనా.

అందుకే భారీ మొత్తాన్ని బాక్సాఫీస్ వద్ద వసూల్ చేయాల్సి ఉన్నందున మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలనీ చూస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. థియేట్రికల్ రిలీజ్ చేయాలంటే కచ్ఛితంగా కరోనాకి వ్యాక్సిన్ / టీకా రావాల్సి ఉంటుంది. ఇప్పట్లో అందుకు ఆస్కారం కనిపించక పోవడంతో సంక్రాంతి వరకూ వేచి చూడాలని నిర్మాతలు భావిస్తున్నారట. మరోవైపు 13 కోట్ల ఆఫర్ తో ఓటీటీ కంపెనీ వెంటపడుతోందని తెలిసింది. కానీ ఇది డెబ్యూ హీరో సినిమా అయినా మైత్రి సంస్థ ఏమాత్రం రాజీకి రాకుండా 22 కోట్ల వరకూ వెచ్చించిందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."