Movies

పవన్ అభిమానులు ఎందుకు ఇంత ఘోరంగా,అంతలా ఊగిపోవటానికి కారణాలు ఏమిటి ?

జనసేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 49వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టారు. మెగాస్టార్ సోదరునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ,సొంత టాలెంట్ తో పవర్ స్టార్ అయ్యాడు. రాజకీయాల్లో చేరి,మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తూ హిందీ పింక్ మూవీకి రిమేక్ గా తాజా చిత్రం ‘వకీల్సాబ్’ పవన్ చేస్తున్నాడు. ఈ మూవీ మోషన్ పోస్టర్ను చిత్రబృందం పవన్ పుట్టినరోజునాడు రిలీజ్ చేసింది. 1996లో ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా రంగ‌ప్ర‌వేశం చేసిన ఆయ‌న ఎంద‌రో అభిమానుల‌కు దేవుడిగా మరో స్థాయికి ఎదిగిపోయారు.

ఎల్లలు లేని అభిమానంతో కోట్ల సంఖ్య లో అభిమానులున్నారు. ఎక్కువ సినిమాలు లేవు,చేసిన వాటిలో ప్లాప్స్ ,డిజాస్టర్స్ కూడా వున్నాయి. అయినా అభిమాన తరంగం పవన్ పేరు చెబితే వెల్లువలా వస్తుంది. ఇప్పటి దాకా 25సినిమాల్లో చేస్తే అందులో రెండు గెస్ట్ రోల్స్ . హిట్ అండ్ ప్లాప్ తో సంబంధం లేకుండా ఫాన్స్ సంఖ్య పెరగడం పవన్ విషయంలోనే ఎక్కువ కనిపిస్తుంది.

నిజానికి 7వ సినిమా ఖుషి తర్వాత 17మూవీ గబ్బర్ సింగ్ వరకూ పవన్ స్టామినా కు తగ్గ హిట్ రాలేదు. మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా, తర్వాత 1997లో వచ్చిన గోకులంలో సీత మూవీలో నెగెటివ్ షేడ్ లో ఉంటుంది. 98లో సుస్వాగతంలో ప్రేమికులు కలవని సీన్ లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కళ్యాణ్ బాబు పేరు పవన్ కళ్యాణ్ గా పాపులర్ అయ్యాడు. ఇక తొలిప్రేమ మూవీలో బాలు పాత్రలో జీవించాడు. ఆరు నంది అవార్డులు,ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నిల్చింది. 99లో వచ్చిన తమ్ముడు మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అల్లరి,బాధ్యత సమంగా చూపిన సినిమా ఇది. తర్వాత బద్రి మూవీతో స్టైలిష్ గా మారాడు. ఇక అభిమానంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించిన మూవీ ఖుషి 2001లో వచ్చింది. పవన్ దేవుడిగా చూడడం,పవర్ స్టార్ గా పిలవడం స్టార్ట్ అయింది.

ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చిన ఇంతగా క్లిక్ కాలేదు. పదేళ్ల తర్వాత 2012లో హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్ అదే రేంజ్ లో ఆడింది. అయితే 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తీసిన అత్తారింటికి దారేది మూవీ సీన్స్ లీక్ చేయడంతో బడ్జెట్ ఎక్కువ సినిమా కావడంతో నష్టాల భయం కమ్ముకుంది. అయితే అభిమాన జనం థియేటర్ వైపే వెళ్లడంతో అప్పట్లో అత్యధిక లాభాలు గడించిన సినిమాగా నిల్చింది. 2018లో అజ్ఞాతవాసితో సినీ జీవిటానికి విరామం ఇస్తూ జనసేన పార్టీతో జనంలోకి వచ్చాడు. సినిమా కన్నా సేవకు ఎక్కువ ఖర్చు చేయడం వలన పవన్ ని అభిమానించే వాళ్ళు ఎక్కువ.

ఓ క్రీడాకారిణికి 5లక్షలు,ఉత్తరాఖండ్ వరదలకు 20లక్షలు,హుదూద్ తుపాన్ కి విశాఖ దెబ్బతినడంతో 50లక్షలు ఇచ్చాడు. ,ఓ చిన్నారి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పవన్ చూడాలంటె కదిలిపోయి వెళ్ళాడు,ఆర్ధిక సాయం కూడా చేసాడు. పావలా శ్యామలకు వైద్యం కోసం స్పాట్ లో లక్ష రూపాయలిచ్చాడు. ఆదిలాబాద్ లో బోర్లు వేయించి నీటి కష్టాలు తీర్చాడు. ఇలా ఎందరికో సాయం చేయడం,ప్రతిభ గలవారిని ప్రోత్సహించడంలో పవన్ ముందంజలో ఉంటాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."