Movies

తెలుగు వారే అయినా ఇతర భాషల్లో దుమ్మురేపుతున్న స్టార్స్

కొందరు స్టార్ హీరోలు తెలుగు ప్రాంతంలో పుట్టినా వేరే భాషా చిత్రాల్లో స్టార్ హీరోలుగా వెలుగొందుతూ ఉంటారు. అందులో తమిళనాట క్రేజీ హీరోగా రాణిస్తున్న జయం రవి తెలుగు వాడే. ఇతడి తండ్రి సీనియస్ మోస్ట్ ఎడిటర్ మోహన్. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో హిట్లర్ మూవీ తీసి హిట్ కొట్టాడు. ఇక ప్రముఖ నటుడు జీవా కూడా ప్రొడ్యూసర్ ఆర్బీ చౌదరి కొడుకే. అలాగే విశాల్ కూడా తెలుగు వాడే. కానీ తమిళ ఇండస్ట్రీలో దుమ్మురేపేస్తున్నాడు. సమీరా రెడ్డి రాజమండ్రి నుంచి బాలీవుడ్ వరకూ ఎదిగింది. తెలుగులో కొన్ని సినిమాలే చేసినప్పటికీ బాలీవుడ్ లో దుమ్మురేపింది.

ఒకరికొకరు మూవీతో తెలుగుకి పరిచయం అయిన హీరో శ్రీకాంత్ ఉరఫ్ శ్రీరామ్ కూడా తెలుగువాడే. కాలం కల్సి రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్ళాడు. నేషనల్ అవార్డు గెల్చిన రావి సింహా హైదరాబాద్ లోనే పుట్టి, తెలుగు మీడియంలో అక్కడే చదివాడు. ఆతర్వాత వీరి ఫ్యామిలీ తమిళనాడు వెళ్లడంతో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి సైతం స్టార్ ఇమేజ్ తెచ్చిన ప్రముఖ డైరెక్టర్ ఏ కోదండ రామిరెడ్డి కొడుకు వైభవ్ తెలుగులో గొడవ మూవీతో ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ క్లిక్ కాలేదు. దీంతో తమిళనాడు వెళ్లి అక్కడ మంచి గుర్తింపు సంపాదించాడు. ఈటివి సీరియల్స్ నుంచి కోలీవుడ్ స్టార్ గా మారిన శ్రీవిద్యను తమిళ ఆడియన్స్ బాగా ఆదరించారు. ఫోటో మూవీతో తెలుగులో చేసిన అంజలికి ఇక్కడ సరైన ఛాన్స్ లు రాకపోవడంతో తమిళంలోకి వెళ్లి దుమ్మురేపింది.

మోహన్ చోప్రా గా వచ్చి మౌలిన్ చోప్రాగా మారిన ముద్దుగుమ్మ సికింద్రాబాద్ కి చెందినా బాలీవుడ్ లో మంచిపేరు తెచ్చుకుంది. బస్టాప్ మూవీలో నటించిన ఆనంది కి ఇక్కడ గుర్తింపు లేకపోవడంతో తమిళనాడు వెళ్లి అక్కడ సూపర్ హిట్ మూవీస్ లో చేసి అవార్డులు కొట్టేసింది. తెలుగులో బ్రహ్మానందం ఎలాగో బాలీవుడ్ లో జానీ లివర్ అలాగే కమెడియన్ గా చక్రం తిప్పాడు. ప్రకాశం జిల్లాకు చెందిన జానీ లివర్ ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాడు. వనపర్తి సంస్థానం వారసుల్లో ఒకరైన అతిథిరావు తాత నిజాం కాలంలోగవర్నర్. ఈమె తెలుగు అమ్మాయే అయినా ముంబైలో సెటిలయింది. హైదరీ మిస్ ఆసియా ఫసిఫిక్ అలియా మీర్జా మంచి బ్యూటీ. బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ కూడా తెలుగు అమ్మాయే.