కలల గురించి 10 ఆసక్తికరమైన నిజాలు
నిద్రలో కలలు రావటం అనేది మానవ సహజం. మనకు వచ్చే కలలలో కొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. మరి కొన్ని కలలు నిరాశను కలిగిస్తాయి. అయితే కొంత మంది మాత్రం తమకు వచ్చిన కలలు నిజం అవుతాయని నమ్ముతారు. కలలపై చాలా పరిశోదనాలు జరిగాయి. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కలల గురించి ఎవరికీ తోచిన విధంగా
వారు అర్ధాలను వెతుక్కోవటం సర్వసాదారణం అయ్యిపోయింది. అటువంటి కలల గురించి 10 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
1. మధ్య నిద్ర ముఖ్యం
నిద్రలో ఒక లోతైన దశను మధ్ నిద్ర అని అంటారు. ఈ మధ్య నిద్రలోనే కలలు వస్తూ ఉంటాయి. తగినంత నిద్ర లేకపోతే ఆందోళన, చిరాకు, కోపం మరియు భోజన క్రమరాహిత్యాల వంటి మానసిక సమస్యలు వస్తాయి.
2. పీడ కలలు
కోపం, విచారం, భయం మరియు భావోద్వేగాలు ఉన్నప్పుడు సాదారణంగా పీడ కలలు వస్తూ ఉంటాయి. అంతేకాక తరచుగా మేల్కొన్నప్పుడు ఒత్తిడి, భయం మరియు అపరాధ భావం వలన కూడా పీడ కలలు వస్తాయి. అయితే ఆశ్చర్యకరంగా, ఈ కలలు పెద్దవారిలో కన్నా పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి.
3. పెంపుడు జంతువుల కలలు
నిజమే పెంపుడు జంతువులు కూడా కలలను కంటాయి. పిల్లులు మరియు కుక్కల వంటి పెంపుడు జంతువులు నిద్ర పోయినప్పుడు, కాళ్ళు వనకటం,ముక్కులు మరియు మీసాలు ఫన్నీ గా కొద్దిగా శబ్దాలు చేయటం వంటివి ఉంటే కనుక అవి కలలను కంటున్నాయని అర్ధం.
4. బ్లాక్ & వైట్ కలలు
ప్రతి ఒక్కరు రంగు రంగుల కలలను కంటూ ఉంటారు. కానీ ఆశ్చర్యకరంగా 12 శాతం మంది కేవలం బ్లాక్ & వైట్ కలలను మాత్రమే కంటారు.
5. కలలను మర్చిపోవటం సర్వ సాధారణం
ఉదయం లేవగానే మొదటి నిమిషంలోపే 90 శాతం మంది కలలను మర్చిపోతారు.
6. కలలో చదవటం లేదా సమయం చెప్పలేము
మనం కలలో సమయాన్ని చెప్పలేము. ఎందుకంటే గడియారంలోని ముల్లుల వివిధ స్థానాలలో కనబడటం వలన సమయాన్ని చూసిన చెప్పలేం. అలాగే కలలో చదవటం కూడా చేయలేము.
7. కలలకు సందర్భం ఉండదు
కలలు అనేవి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వస్తాయి. అయితే పురుషులకు మాత్రం సాదారణంగా వస్తూనే ఉంటాయి. అంగస్తంభనలు నిద్రలో ఎలా సంభవిస్తాయో అలాగే కలలు కూడా సంబంధం లేకుండా వచ్చేస్తూ ఉంటాయి.
8. కలలో క్రియేటివిటీ
సృజనాత్మక కలల ద్వారా ప్రేరణ పొంది అనేక గొప్ప ఆవిష్కరణలు జరిగాయి. DNA యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణం,బెంజీన్ యొక్క రసాయన నిర్మాణం మరియు టెలిఫోన్ వంటి ఆవిష్కరణలు ఈ విధంగానే జరిగాయి. కొంత మంది ప్రజల కలలు గొప్ప ఆలోచన ఉత్పత్తి కోసం మరియు వారి ఆలోచన ప్రక్రియలో ఒక బాగంగా ఉంటాయి.
9. కళ్ళు కనపడని వారి కలలు
పుట్టుకతోనే గుడ్డి వారిగా పుట్టిన వారి కలలు వినికిడి, రుచి, వాసన మరియు స్పర్శ అనుభూతుల ఆధారంగా ఉంటాయి. కొంత జీవితం గడిచాక కళ్ళు పోయిన వారి కలలు గతంలో జరిగిన విషయాల విజువల్స్ ఆధారంగా ఉంటాయి.
10. కలల కోసం మందు
కొంత మంది కలల అనుభూతి పొందటానికి మరియు కృత్రిమంగా కలలను ప్రేరేపించడానికి డిమితాయిల్ట్రిప్టమీన్ (DMT) అనే స్లైకలజికల్ మందును ఉపయోగిస్తారు.

