Beauty Tips

హైపర్ పిగ్మెంటేషన్ రావటానికి కారణాలు ఏమిటి?

హైపర్ పిగ్మెంటేషన్ రావటానికి అనేక కారకాలు మరియు కారణాలు ఉన్నాయి.హైపర్ పిగ్మెంటేషన్ రావటానికి ఒక కారణం లేదా రెండు,మూడు కారణాలు కలిసి ఉండవచ్చు.

1. గాయాలు
చర్మం వాచినప్పుడు మరియు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అయ్యే గాయాలు మానిన తర్వాత ఆ మచ్చలు అలాగే ఉండిపోతాయి. ఆ మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ కి దారి తీస్తాయి.

2. సూర్యుడు
చర్మంలో పిగ్మెంట్ రావటానికి కారణం సూర్యుని కిరణాలు మరియు వేడి అని చెప్పవచ్చు. ఎండలోని అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మం మీద పడినప్పుడు మెలనిన్‌ని ఉత్పత్తి చేసే కణాలు ప్రభావితం అయి పిగ్మెంట్ రావటానికి కారణం అవుతాయి.

3. మందులు
కొన్ని రకాల మందులు,క్రీమ్స్ మరియు కొన్ని రకాల ఎలర్జీలు పిగ్మెంట్రా వటానికి కారణం అవుతాయి.

4. ఒత్తిడి
ఒత్తిడి, ఉద్వేగపూరితమైన షాక్ వంటివి పిగ్మెంట్ రావటానికి కారణాలు కావచ్చు.

5. వ్యాధులు:
కామెర్ల వంటి కొన్ని రకాల వ్యాధుల కారణంగా చర్మం రంగు మారి పిగ్మెంట్వ చ్చే అవకాశం ఉంది.

6. హార్మోన్లు
హార్మోన్లు మరియు యవ్వన దశ మరియు గర్భాదరణ సమయంలో వచ్చే జన్యు మార్పులు హైపర్ పిగ్మెంటేషన్ కి దారి తీస్తాయి.

7. మొటిమలు
మొటిమలు మరియు గడ్డల కారణంగా వచ్చిన నల్లని మచ్చల పలితంగా హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."