Movies

అక్షయ్ కుమార్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు

ఒకప్పుడు సెలబ్రిటీలకు అంబాసిడర్ కారు ఉంటె గొప్ప. ఆతర్వాత ఫియట్ కారు,బెంజి కారు,.. ఇక రకరకాల మోడల్స్ లో ఆడి కార్లు వచ్చేసాయి. అటు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరికీ మినిమమ్ రెండు మూడు ఖరీడైన కార్లు ఉంటున్నాయి. ఇక బైక్ ల సంగతి చెప్పక్కర్లేదు. అంతటితో ఆగలేదు,ప్రయివేట్ హెలికాఫ్టర్లు,కూడా కొందరికి ఉండేవి. ఇప్పుడు ఏకంగా విమానాలు సొంతంగా మెయింటింగ్ చేసేస్తున్నారు. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అయితే ఏకంగా విమానాలను పాసింజర్స్ కోసం నడుపుతున్నాడు. కొంతమందికి విమానాలు ఉన్నాయని టాక్.

ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రెండు చేతులా సంపాదన చూస్తే, ఇండియాలో నెంబర్ వన్ హీరో అని టాక్. ఇతడికి ఏడాదికి కనీసం 4 సినిమాలు చేస్తుంటాడు.. ఆ నాలుగు సినిమాలు కలిపి దాదాపు 800 కోట్లు కలెక్షన్ చేస్తాయి . అందుకే ఈయన సంపాదన కూడా కోట్లలోనే ఉంటుంది. ఒక్కో సినిమాకు దాదాపు 80 కోట్లకు పైగానే తీసుకుంటా డని టాక్. ఇక సినిమా హక్కులు సరేసరి. ఇవి కాకుండా యాడ్స్, రియాలిటీ షోలు కలిపి ఏడాదికి అక్షయ్ ఆదాయం వందల కోట్ల ని చెప్పవచ్చు. ప్రస్తుతం 4 సినిమాలతో బిజీగా ఉన్నాడు.

సంపాదనను బట్టి ఖర్చు కూడా ఉంటుంది కదా. అయితే అక్షయ్ నెలసరి ఖర్చులు తక్కువగానే ఉంటాయి గానీ, మెయింటెనెన్స్ మాత్రం భారీగానే ఉంటుందట. ఎందుకంటే సొంతంగా ఓ ప్రైవేట్ జెట్ ఉందని టాక్. విమానం మెయింటేన్ చేయాలంటే అందుకు తగ్గ స్టేటస్,సంపాదన ఉండాలి. అందుకే అక్షయ్ కి దాదాపు 260 కోట్ల విలువ చేసే జెట్ మెయింటేన్ చేస్తున్నాడు అని టాక్. ప్రభుదేవాతో కలిసి అక్షయ్ దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విమానం సంగతి బయటపడింది.