Healthhealth tips in telugu

గర్భధారణ సమయంలో ఎలాంటి ఆహారం,ఎంత మొత్తంలో తీసుకోవాలి?

Health Tips for Pregnant Women:మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి వరం. ఆ వరం శాపం కాకుండా చూసుకోవలసిన భాద్యత కూడా ఆమెదే. గర్భిణిలు తీసుకొనే మందుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో,ఆహారం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఇద్దరికి సరిపడా ఆహారంను తీసుకుంటూ ఉంటారు. అయితే అలా తీసుకోవలసిన అవసరం లేదు. గర్భిణిలు ఎలాంటి ఆహారం,ఎంత మొత్తంలో తీసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాము.

గర్భిణిలు ఎక్కువగా ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ అధిక బరువుతో పుడతాడు అనేది ఒక అపోహ మాత్రమే. గర్భిణిలు ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.అలాగే మోతాదుకు మించి ఆహారం తీసుకోకూడదు.

ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదు. కొద్ది కొద్దిగా వీలైనన్ని సార్లు అంటే రోజు మొత్తం మీద నాలుగైదు సార్లు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.

అందుబాటులో ఎప్పుడూ కొన్ని పళ్ళను ఉంచుకోవటం మంచిది. సిడ్ లెస్ గ్రేప్స్ వంటి వాటిని స్నాక్స్ గా తీసుకోవాలి. కెఫీన్ అధికంగా లభించే ద్రవ పదార్దాలను పూర్తిగా మానేస్తే మంచిది.

బరువు పెరగటం అనేది గర్భిణిలకు సర్వ సాదారణం. అయితే ఒక్కసారిగా బరువు అధికంగా పెరగటం లేదా తగ్గటం అనేది జరిగితే అది అనారోగ్యానికి చిహ్నం.

అస్మా తో బాధపడే గర్భిణిలు వేరు శనగపప్పు కి దూరంగా ఉండాలి. వీరు ఆహారంలో వీటిని తీసుకుంటే పుట్టబోయే బిడ్డ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పచ్చి మాంసం,ఉడికి ఉడకని మాంసాహారం అసలు తినకూడదు. మాంసాహారంలో ఉండే లివర్ లేదా లివర్ తో చేసిన ఆహార పదార్దాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."