షుగర్ ఉన్నవారు మాంసాహారం (నాన్ వెజ్ ) తింటే ఏమి అవుతుందో తెలుసా?
Non veg for diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నిర్వహణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. మనలో చాలా మందికి డయాబెటిస్ ఉన్నవారు మాంసాహారం తినవచ్చా అనే సందేహం ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారంలో పిండి పదార్ధాలు తక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు మాంసాహారం తినవచ్చు. అయితే లిమిట్ గానే తినాలి. మాంసాహారంలో కొవ్వు ఎక్కువగా ఉండుట వలన…ఎక్కువ మోతాదులో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటమే కాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
డయాబెటిస్ ఉన్నవారు 15 రోజులకు ఒకసారి 75 గ్రాముల మటన్,చికెన్ తీసుకోవచ్చు. అదే సీ ఫుడ్ విషయానికి వచ్చేసరికి చేపలను వారంలో రెండు సార్లు తీసుకోవచ్చు. అది 75 గ్రాముల మోతాదు మించకూడదు. డయాబెటిస్ ఉన్నవారు డయాబెటిస్ నియంత్రణలో ఉంటే ఈ విధంగా తినవచ్చు.
డయాబెటిస్ నియంత్రణలో లేనివారు మాంసాహారానికి దూరంగా ఉంటేనే మంచిది. డయాబెటిస్ నియంత్రణలోకి వచ్చాక నాన్ వెజ్ తినవచ్చు. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్,గుండె జబ్బులు వంటివి చాలా తొందరగా వచ్చేస్తాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/