Movies

జయప్రకాశ్ రెడ్డి ఫ్యామిలీకి బాలయ్య సాయం వెనుక కారణం ఏంటబ్బా

ఇంట్లో బాత్ రూమ్ లో గుండెపోటుతో కుప్పకూలి హఠాన్మరణం చెందిన రంగస్థల,సినీ నటుడు జయ ప్రకాష్ రెడ్డి ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించారు. భయంకరమైన విలనిజం పండించి,కామెడీ కూడా అదే తీరుగా పండించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన నటన సూపర్. అందుకే జయప్రకాశ్ లేకపోవడం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు గా అంతా కన్నీరు పెట్టుకున్నారు.. ఆయన మరణంపై స్పందించారు. భారత ప్రధాని మోడీ ,కేంద్ర హోమ్ మంత్రి కూడా ట్వీట్ చేస్తూ .. జేపీ మృతిపై సంతాపం వ్యక్తం చేసాడంటే ఆయన స్థాయి వేరే చెప్పక్కర్లేదు.

గత 32 ఏళ్లుగా ఈయన తెలుగు, తమిళంతో పాటు మరిన్ని భాషల్లో కూడా నటించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న జయప్రకాశ్ రెడ్డి రంగస్థలం నుంచి వెండితెరపైకి వచ్చి సినిమా రంగంలో ఎంతగా రాణిస్తున్న, ఏనాడూ వదిలిపెట్టలేదు. అందుకే ఇటు సినిమా రంగం,అటు రంగస్థల రంగం లో కూడాఈయన మరణం అందర్నీ కలిచి వేసింది. గుండెపోటుతో హఠాన్మరణం చెందడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన కుటుంబానికి బాలకృష్ణ 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సహజంగానే అది చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. ఇన్నేళ్లుగా జయ ప్రకాష్ రెడ్డి ఇండస్ట్రీలో ఉన్నారు.. లెజెండరీ నటుడు అనే స్థాయికి ఎదిగారు.. అలాంటి వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులున్నాయా..? మొన్న సరిలేరు నీకెవ్వరు వరకు కూడా ఆయన బిజీగా ఉన్నాడు కదా.. అలాంటప్పుడు ఆయనకు ఆర్థిక సాయం ఎందుకు అనే వాదన చర్చకు వస్తోంది. స్నేహపూర్వకంగా బాలయ్య ప్రకటించాడా లేదంటే నిజంగానే జయ ప్రకాష్ రెడ్డి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా అనేది అర్థం కావడం లేదు. ఆయన చనిపోయిన ఫ్లాట్ చూస్తుంటే మాత్రం చాలా చిన్నగా అనిపిస్తుంది. పెంట్ హౌజ్‌లో ఉన్నాడని తేలింది. మొత్తానికి ఎంత ఇమేజ్ ఉన్నా సొమ్ములు మాత్రం వెనకేసుకోలేదా అనే మాట విన్పిస్తోంది.