Health

పారాసెటమాల్ ఎక్కువగా వాడుతున్నారా… అయితే ఒక షాకింగ్ న్యూస్

మనలో చాలామంది ఏదో ఒక సమయంలో పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకోవడం సర్వసాధారణమే. ఒంటి నొప్పులు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం. అయితే నిపుణులు ఈ టాబ్లెట్స్ ఎక్కువ వాడకూడదు అని హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమని అంటున్నారు. ప్రతి ఒక్కరికి పారాసెటమాల్ టాబ్లెట్ మీద ఒక అవగాహన ఉండాలి అని అంటున్నారు. ఒక పరిశోధన చేసి ఈ విషయాన్ని నిపుణులు చెబుతున్నారు.

అవసరానికి మించి పారాసెటమాల్ టాబ్లెట్స్ వాడవద్దు అని చెబుతున్నారు. కొంతమంది ఏ మాత్రం కాస్త తేడాగా ఉన్నా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోకుండా అవసరాన్ని బట్టి వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో క్లియర్ గా చెప్పలేదు. ఏది ఏమైనా పారాసెటమాల్ టాబ్లెట్స్ అవసరం మేరకు వాడటం ఉత్తమం.