Kitchen

మామిడి కాయ పకోడీ

కావలసిన పదార్దాలు

శనగపిండి – 3/4 కప్పు
పచ్చి మామిడి కాయ తురుము – 1/4 కప్పు
ఉల్లిపాయ ముక్కలు – 1/2 కప్పు
స్ప్రింగ్ ఉల్లిపాయ ముక్కలు – 1/2 కప్పు
కొత్తిమీర ఆకులు – 1/4 కప్పు
చాట్ మసాలా – అర టీ స్పూన్
కరివేపాకు – కొంచెం
పుదినా – కొద్దిగా
అల్లం,వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్
జీలకర్ర పొడి – అర టీ స్పూన్
పచ్చిమిరప – 2 (ముక్కలుగా చేసుకోవాలి)
తినే సోడా – చిటికెడు
సోంపు గింజలు – అర టీ స్పూన్
ఉప్పు – రుచికి తగినంత
నూనె – వేగించటానికి సరిపడా

తయారీ విధానం

ఒక పెద్ద బౌల్ తీసుకోని దానిలో శనగపిండి,పచ్చి మామిడి కాయ తురుము, ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఆకులు, చాట్ మసాలా, కరివేపాకు,పుదినా,అల్లం,వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి,పచ్చిమిరప ముక్కలు, తినే సోడా, సోంపు గింజలు, ఉప్పు,కొంచెం నీరు పోసి అన్నింటిని బాగా కలపాలి. ఇది పలచగాను,గట్టిగాను లేకుండా మధ్యస్థంగా ఉండాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కినాక పై మిశ్రమాన్ని పకోడీ మాదిరిగా వేసుకొని గోల్డ్ కలర్ వెచ్చే వరకు వేగించాలి. అంతే నోరురుంచే మామిడి కాయ పకోడీ రెడీ. దీనికి సాస్ లేదా పుదినా చట్ని మంచి కాంబినేషన్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."