Beauty Tips

ప్రత్యేక సందర్భాలలో కాస్త అందముగా కనపడాలంటే……

ప్రత్యేక సందర్భాలలో కాస్త అందముగా కనపడాలని అందరికి ఉంటుంది. అయితే దానికి తగ్గట్టుగా మెరుగులు దిద్దుకోవాలంటే ఇంటిలోనే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము.

పచ్చి పాలలో ఓట్స్ నానబెట్టాలి. తర్వాత దానిలో ఒక స్పూన్ తేనే,రెండు స్పూన్స్ నల్ల ద్రాక్ష రసం,రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ చర్మం పై ఉన్న మురికిని తొలగిస్తుంది. అప్పుడు మీ ముఖం కాంతివంతముగా ఉంటుంది.

పాల మీగడలో ఒక స్పూన్ పసుపు,చిటికెడు పంచదార వేసి కలిపి ముఖానికి రుద్దుకోవాలి. ఇలా చేయుట వలన చర్మంపై ఉన్న మృత కణాలు తొలగి చర్మం మృదువుగా ఉంటుంది.

కళ్ళ కింద నలుపుగా మారినప్పుడు మేకప్ తో కనిపించకుండా చేయాలనీ లేదు. టమోటా రసంలో రెండు చుక్కల రోస్ వాటర్,ఒక స్పూన్ పాలు కలిపి ఆ మిశ్రమాన్ని కొంత సేపు ఫ్రిజ్ లో కొంత సేపు ఉంచి, ఆ తర్వాత దానిలో కాటన్ ముంచి కళ్ళ అడుగున తుడవాలి.

కీరదోస గుజ్జులో పాలు,బాదం మిశ్రమం,ఒక స్పూన్ నిమ్మరసం,కాస్త శనగపిండి కలిపి వంటికి పట్టించి కాసేపు ఆగి తడి చేత్తో తుడుస్తూ ఆ పూతను తొలగించుకోవాలి. చర్మంపై పేరుకున్న ట్యాన్ తొలగి చర్మం మెరుపు వస్తుంది.