Kitchen

వెజ్ కబాబ్ సింపుల్ గా ఇలా చేసుకుంటే సరి

కావలసిన పదార్దాలు :

బంగాళాదుంపలు 1 /2 కిలో
క్యారట్ 1 /2 కిలో
అరటికాయలు 2
బీట్రూట్ 4
ఉల్లిపాయలు 4
సెనగపిండి 1 /2 కప్పు
బ్రెడ్ ముక్కలు ఎండినవి 1 /2 కప్పు
బ్రెడ్ స్లేసెస్ 12
ఫ్రెష్ క్రీం 2 చెంచాలు
ఉప్పు,నూనె సరిపడా
కొత్తిమీర 8 చెంచాలు
మసాల ముద్ద తయారికి :
వెల్లులి 8 పాయలు
అల్లం 1 అంగుళం
గసగసాలు 2 చెంచాలు
కారం 1 చెంచా
జీలకర్ర 1 /2 చెంచా
పచ్చిమిర్చి 6
సోంపు 1 /2 చెంచా
యాలకులు 4
నల్ల మిరియాలు 1 చెంచా
వెనిగర్ 4చెంచాలు
దాల్చినచెక్క 1 అంగుళం ముక్క
లవంగాలు 4

తయారి విదానం :

బంగాళాదుంపలును ఉడికించి తొక్కు తెసి మెత్తగా చేసి ఉంచాలి. క్యారట్, బీట్రూట్, చెక్కు తీసి, బీన్స్ కూడా సన్నగా కట్ చేసి మొత్తం ఉడికించాలి. ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా కట్ చేయాలి. అరటికాయలను కూడా కుక్కర్ లో ఉడికించి తొక్కు తీసి ముద్ద చేసి ఉంచాలి. క్యారోట్, బీట్రూట్ సన్నగా తురిమి ఉంచాలి. ఇప్పుడు బాండి లో నూనె పోసి కాగిన తర్వాత ఉల్లి ముక్కలు వేపి ఉప్పు, మాసాలా ముద్దలను వేసి పచ్చి వాసన పోయేలా బాగా కలపెడుతూ వేపాలి.

తయారు చేసుకున్న కూరలను వేసి నీరు పోయేంత వరకు వేపి దింపి దీనికి శనగపిండి, నీటిలో తడిపి తీసి బ్రెడ్ స్లిస్ లు కలిపి బాగా కలిపి ఒకే సైజు ఉండలుగా చేసుకుని వత్తి కాగిన నూనె లో బాగా ఎర్రగా వేపాలి. టమేటా కెచప్ లేదా తీపి చట్ని, ఉల్లిముక్కల మీద ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం పైన చల్లి వీటితో సర్వ్ చెయ్యాలి. పైన వెన్న రాయటం మరవద్దు.