Kitchen

మష్రూమ్ సాండ్ విచ్

కావల్సిన పదార్థాలు :
బటన్ మష్రూమ్స్ 250 గ్రా
పచ్చ బఠానీలు -50 గ్రా
ఉల్లి గడ్డ -1(ఒకటి)
మిరప్పొడి -1 1/2 స్పూన్
గరమ్ మసాలా- 1 1/2 స్పూన్
శాండ్ విచ్ బ్రెడ్ స్లైస్-6లేక 8
వెన్న – 1 టేబుల్ స్పూన్
నూనె – తగినంత లేక 1 స్పూన్
ఉప్పు -తగినంత

తయారుచేసేవిధానం:

ఉల్లి గడ్డను సన్నగా కోసి పెట్టుకోండి. పచ్చి బఠాణీలను ఉడకబెట్టుకొని పక్కన ఉంచండి. బాణలిలో నూనె వేసి అందులో ఉల్లి ముక్కలను దోరగా వేయించండి. ఉల్లి ముక్కలు వేపేటపుడు కాస్త చక్కెరను వేసినట్లయతే బంగారురంగులో ముక్కలు వేగి చూడడానికి అందంగా కనిపిస్తాయి. ఉల్లి ముక్కలు వేగిన తర్వాత అందులో మష్రూమ్స్, ఉడకబెట్టిన బఠాణీలు కలపండి. మూతపెట్టి ఆ మిశ్రమాన్ని ఓ ఐదు నిమిషాలు మగ్గనివ్వండి.
మష్రూమ్స్ బాగా మగ్గాయనుకొన్నాక దానికి కారంపొడి, గరమ్ మసాలాలు జల్లండి. ఉప్పువేసి బాగాకలపండి. ఓ రెండు నిమిషాలు ఉండనిచ్చి దింపండి. . కాస్త చల్లారాక కొద్దికొద్దిగా తీసుకుని శాండ్ విచ్ బ్రెడ్ స్లైస్‌లనడుమ వుంచాలి. శాండ్ విచ్ మేకర్‌ను తీసుకుని దానిలో కాస్త వెన్న రాయండి. బ్రెడ్ స్లైస్‌ల అంచులకు కూడా కాస్త వెన్న పూసి శాండ్ విచ్ మేకర్ అమర్చి వేడి చేయండి. వేడి వేడి సాండ్ విచ్ రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."