కృష్ణ ,జయప్రద కాంబినేషన్ లో వచ్చిన 45 సినిమాల్లో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా ?
పరిశ్రమలో హిట్ ఫెయిర్ గా కొన్ని జంటలు నిలిచాయి. అందులో సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద కాంబినేషన్ ఒకటి. వీరిద్దరూ కల్సి 45సినిమాలు చేసారంటే మామూలు విషయం కాదు. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ వరకూ కృష్ణ ,విజయ నిర్మల జంట నడిచింది. కలర్ మూవీస్ వచ్చాక కృష్ణ , జయప్రద జంట కుదిరింది. బాపు డైరెక్షన్ లో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మూవీ లో కృష్ణ సరసన తొలిసారి జయప్రద నటించింది. ఇది హిట్ కాలేదు. తర్వాత చేసిన మనవూరి కథ మూవీ కూడా హిట్ కాలేదు. తర్వాత వచ్చిన ఈనాటి బంధం ఏనాటిదో మూవీ హిట్ అయింది.
ఆతర్వాత దొంగలకు దొంగ మూవీ తో కృష్ణ ,జయప్రద జంట ఫాన్స్ కి కనువిందు చేసింది. తరువాత అల్లరి బుల్లోడు మూవీ కొత్తదనం తెచ్చింది. ఇక దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఊరికి మొనగాడు ఈ జంట మరింత కనువిందు చేయడంతో సూపర్ హిట్ అయింది. ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు సాంగ్ కోసం రిపీట్ ఆడియన్స్ వచ్చారు. ఓపక్క కృష్ణ,శ్రీదేవి జంటను ఆదరిస్తూనే,మరోపక్క కృష్ణ ,జయప్రద జంటకు ఫాన్స్ పట్టం కట్టారు.
ఇక కృష్ణ,జయప్రద జంటగా వచ్చిన ఆఖరి మూవీ చంద్ర వంశం. అలాగే జయప్రద తమ్ముడు రామ్ కుమార్ హీరోగా వచ్చిన ఓ సినిమాకు కృష్ణ చేత క్లాప్ కొట్టించింది. కాగా ఒకటి రెండు సినిమాల్లో కృష్ణ,జయప్రద అన్నాచెల్లెలుగా చేయడాన్ని ఫాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ,ఇన్ని మూవీస్ లో నటించడం అసాధ్యం. అందుకే ప్రతి సినిమాకు కొత్త హీరోయిన్ అవసరం అవుతోంది.

