Movies

7జి బృందావనం కాలనీ సినిమాలో నమ్మలేని నిజాలు….ఎన్ని కోట్ల లాభమో ?

సెల్వ రాఘవన్ రచయితగా, దర్శకునిగా తొలిసినిమాతోనే పేరు తెచ్చుకున్నాడు. హీరోగా ధనుష్ కి బ్రేక్ ఇచ్చిన మూవీ డైరెక్టర్ గా ,రైటర్ గా సెల్వ రాఘవన్ కి వచ్చిన ఇమేజ్ తో ఏ ఎం రత్నం ప్రొడ్యూసర్ గా సినిమాకు కమిట్ అయ్యాడు. బోల్డ్ కంటెంట్ ఉండడంతో మాధవన్ రిజెక్ట్ చేసాడు. సిద్ధార్ధ్ ని అనుకుంటే,డేట్స్ ఖాళీలేదు. దాంతో ఎవరిని తీసుకోవాలని రత్నం ఆఫీసులో చర్చ జరుగుతుంటే, రత్నం గారబ్బాయి రవికృష్ణ అక్కడికి రావడంతో హీరోగా ట్రై చేయవచ్చు కదా అని సెల్వ రాఘవన్ అనడం, ఫోటో టెస్ట్ చేయడంతో ఒకే అయింది. యాక్టింగ్ కోర్సు నేర్చుకోమని లండన్ పంపించారు. హీరోయిన్ గా జెనీలియాకు అడిగినా, స్టోరీ లో పంజాబీ అమ్మాయి కావడంతో సోని అగర్వాల్ ని సెలక్ట్ చేసారు.

మ్యూజిక్ డైరెక్టర్ గా యవన్ శంకర్ రాజా సెలక్ట్. 2004మేలో 7జి బృందావనం కాలనీ మూవీ స్టార్ట్ అయింది. చెన్నై వాహిని స్టూడియోలో చాలా భాగం అక్కడే సెట్స్ వేసి షూటింగ్ తీశారు. రామోజీ ఫిలిం సిటీ,అన్నపూర్ణ స్టూడియో ఇలా కొంత కొంత భాగం షూటింగ్ 3కోట్ల బడ్జెట్ తో పూర్తయింది. మూడు గంటల 20నిముషాలు సినిమా నిడివి వచ్చింది. అయితే నిర్మాత వత్తిడితో 15నిముషాలు కట్ చేసారు. 2004అక్టోబర్ 15న తమిళంలో విడుదలైంది. నవంబర్ 6న తెలుగులో రిలీజయింది. కాలేజ్ ఫ్రెండ్స్ సీన్స్, ఇంట్లో తిట్టడం,కొడుకు ప్రయోజకుడయ్యాడని తండ్రి ఆనందం,హీరోయిన్ కి హీరోపట్ల గల ప్రేమ ఇలా అన్ని షాట్స్ ఆకట్టుకుంటాయి.

అందుకే థియేటర్స్ దగ్గ్గర యూత్ పడిగాపులు కాసారు. హీరోయిన్ చనిపోయాక హీరో పిచ్చోడిలా తిరిగే సీన్ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇలా సాంగ్స్ ,మేషన్స్ అన్నీ కుదిరాయి. క్లైమాక్స్ ట్రాజడీగా ముగించడం సెల్వరాజ్ పనితనానికి ,గట్స్ కి నిదర్శనం. యూత్ అందరూ 7జి ని అద్భుతంగా ఆదిరించారు. హీరోకి మంచి స్టార్ స్టేటస్,డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ హోదా, హీరోయిన్ కి స్టార్ హోదా ఇలా అందరికీ బ్రేక్ ఇచ్చిన మూవీ ఇది.

తమిళ వెర్షన్ లో 10కోట్లు షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగులో 5కోట్లు వరకూ కలెక్ట్ చేసింది. 25సెంటర్స్ లో వందరోజులు ఆడడం అద్భుతం. ఇక ఆసమయానికి శంకర్ దాదా ఎంబిబిఎస్,నా అల్లుడు,వంటి మూవీస్ ఉన్నా ఈ సినిమాపై ప్రభావం పడలేదు. బెంగాలీ,ఒడియా , కన్నడ,హిందీలో కూడా రీమేక్ అయింది.