Movies

అంజనా ప్రొడక్షన్స్ లో చిరు చేసిన సినిమాల్లో ఎన్ని హిట్స్ అయ్యాయో తెలుసా ?

స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుని కూడా హీరోగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొన్ని సినిమాల్లో హీరోగా చేసిన ఆడలేదు. దాంతో సపోర్టింగ్ రోల్స్ కి పరిమితం అయ్యాడు. ఇక నిర్మాతగా అవతరించి, తల్లి పేరిట అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అన్నయ్య చిరంజీవితో మూవీస్ తీశారు. రుద్రవీణ తొలిసినిమాగా నిర్మించాడు. కె బాలచందర్ తెరకెక్కించిన ఆ మూవీ పెద్దగా ఆడకపోయినా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది.

ఇక హిట్ మూవీస్ డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి నటించిన త్రినేత్రుడు మూవీని కూడా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించాడు. అయితే పెద్దగా ఆడలేదు. ఆతర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరరావు డైరెక్షన్ లో నటించిన ముగ్గురు మొనగాళ్లు మూవీ కూడా నాగబాబు నిర్మించాడు. ఇది ఏవరేజ్ గా నిల్చింది. ఇక బావగారూ బాగున్నారా మూవీ హిట్ చిత్రంగా నిల్చింది. నాగబాబు కూడా ఇందులో నటించాడు. జయంత్ సి పరాన్జీ డైరెక్ట్ చేసాడు.

ఇక స్టాలిన్ మూవీలో చిరుతో కల్సి నాగబాబు నటించాడు. ఇది కూడా ఏవరేజ్ అయింది. మొత్తానికి హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా తేడా కొట్టింది. ఇక చిరు తనయుడు రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ కూడా దెబ్బతినడంతో ఆ మూవీతో ఆస్తి మొత్తం నాగబాబు పోగొట్టుకున్నాడు. కొన్నాళ్ళు తమ్ముడు డబ్బులు సర్దాడని టాక్. అయితే టివి షోస్ చేయడం ద్వారా తన సంపాదన తాను చేసుకుంటున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."