Movies

కష్టాలు పడ్డా సరే, సొంతవాళ్లని ఏమీ అడగని నటుడు…ఎన్ని కష్టాలో పాపం

కష్టాలు ఎవరికైనా వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొని నిలబడడమే గొప్పతనం. మామూలు జనానికే కాదు,సెలబ్రిటీలకు కూడా కష్టాలు సహజం. హిట్ లేకపోయినా, సినిమా ఆడకపోయినా ఛాన్స్ లు రావు. అప్పుడు గుండెనిబ్బరంతో నిలబడి మరింత కష్టపడితేనే ఉండగలరు. చాలామంది నటీనటులు ఇలాగే నిలబడ్డారు. అందులో ముఖ్యంగా తొలిసినిమాతోనే హిట్ కొట్టి, అదే సినిమా పేరుని తన ఇంటి పేరుగా చలామణిలోకి తెచ్చుకున్న శుభలేఖ సుధాకర్ ఒకరు.

కళాతపస్వి కె విశ్వనాధ్ తీసిన శుభలేఖ మూవీలో చిరంజీవి, సుమలత హీరో హీరోయిన్స్ గా నటించారు. అందులో నటించిన సుధాకర్ తర్వాత నుంచి శుభలేఖ సుధాకర్ అయ్యాడు. కొన్ని సినిమాల్లో హీరోగా, ఎన్నో సినిమాల్లో సైడ్ హీరోగా, చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసాడు. అయితే ఈయన సాక్షాత్తూ ఇటీవల మరణించిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కి బావ.

కానీ ఒకానొక దశలో సినిమాల్లో ఛాన్స్ లు తగ్గడంతో ఆర్ధికంగా శుభలేఖ సుధాకర్ ఇబ్బందులు పడ్డాడు. అయితే అతని వైఫ్, సింగర్ ఎస్పీ శైలజ అర్ధం చేసుకోవడంతో ఎలాంటి ఒడిడుకులు పడలేదని శుభలేఖ సుధాకర్ చెబుతారు. అలాగని ఆర్ధిక సాయం కోసం ఎస్పీ బాలు దగ్గరకు కూడా వెళ్ళలేదు. తర్వాత సినిమాల్లో ఛాన్స్ లు రావడమే కాదు, టివి సీరియల్స్ లో కూడా శుభలేఖ సుధాకర్ తనదైన ముద్ర వేసాడు. సినిమాలు, సీరియల్స్ లో చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఈయన చెన్నైలో తన ఫ్యామిలీతో నివాసం ఉంటున్నారు. షూటింగ్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."