యమగోల సినిమా వెనక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో…అసలు నమ్మలేరు
yamagola Telugu Movie : ఓపక్క స్వర్గానికి వెళ్లి, రంభ ఊర్వశి మేనకలతో డాన్స్, ఇంద్రునితో వాదన, మరోపక్క యమలోకంలో యుముడితో గొడవ, ఇలా రెండు విభిన్న అంశాలను ఎంచుకుని తెరకెక్కించిన యమగోల మూవీ అప్పట్లో ఓ సంచలనం. సతీ సావిత్రి తర్వాత 30ఏళ్ళ తర్వాత యముడి పాత్ర జోలికి ఎవరూ వెళ్ళలేదు. సి పుల్లయ్య యముడి పాత్ర పెట్టి ఒక సాంఘిక చిత్రం గా ఎన్టీఆర్ తో దేవాంతకుడు తీశారు.
ఎస్వీఆర్ యముడిగా చేశారు. తర్వాత యమగోల స్క్రిప్ట్ పని చేపట్టాక కొంత పూర్తయ్యాక పక్కన పెట్టేసారు. ఆయన తర్వాత ఆయన కొడుకు సీఎస్ రావు కూడా మరికొంత వర్క్ చేసారు. డివి నరసరాజు చూసి నచ్చలేదనడంతో ఈ స్క్రిప్ట్ ని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు కొన్నప్పటికీ పక్కన పెట్టేసారు.
కెమెరామెన్ ఎస్. వెంకట రత్నం పల్లవి ప్రొడక్షన్స్ పెట్టి శోభన్ బాబుతో ఈతరం మనిషి అనే మూవీ చేసారు. అది 12లక్షలు నష్టం తెచ్చింది.
ఈ నేపథ్యంలో రామానాయుడు దగ్గర 5వేలకు వెంకటరత్నం స్క్రిప్ట్ కొన్నాడు. నరసరాజు సినిమా కథకు మంచి పొజిషన్ తెచ్చారు. ఇక హీరోగా ఎన్టీఆర్ అనుకున్నారు.
తాతినేని రామారావు డైరెక్టర్ గా పెట్టుకున్నారు. ఎన్టీఆర్ యముడిగా, బాలకృష్ణ హీరోగా చేద్దామన్న ప్రతిపాదన పెడితే , బాలయ్య స్టడీస్ లో ఉన్నాడు. నేనే హీరోగా చేస్తాను, యముడిగా సత్యనారాయణను పెట్టమని ఎన్టీఆర్ చెప్పడంతో అలాగే ప్రొసీడ్ అయ్యారు. అడవిరాముడు విడుదలైన రెండు నెలలకు ఎన్టీఆర్ పుట్టినరోజున మద్రాసు వాహిని స్టూడియోలో ప్రారంభం అయింది.
అక్కడే యమలోకం సెట్ వేశారు. నెల్లూరు, హైదరాబాద్ లలో షూటింగ్ చేసారు. 30రోజుల్లో షూటింగ్ చేయాలనుకుంటే 27రోజులకే పూర్తయింది.
అడవిరాముడు ఆడిన సినిమా హాళ్లల్లోనే యమగోల రిలీజ్ చేయాలనుకున్నారు. లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు పంపిణీ కి ఒకే. కానీ అడవి రాముడు 100రోజులు దాటి ఆడుతున్న నేపథ్యంలో 175డేస్ అయ్యాక రిలీజ్ కి ఒప్పందం కుదిరింది.
ఆగస్టులో సెన్సార్ పూర్తయ్యాక రెండు నెలలు వేచి వున్న సినిమా ఇదే. ఆగస్టులో చాణక్య చంద్రగుప్త మూవీ రిలీజ్ సందర్బంగా శుభాకాంక్షలు చెబుతూ అక్టోబర్ 21న యమగోల రిలీజ్ గురించి వెంకటరత్నం ప్రస్తావించారు. అనుకున్న డేట్ ప్రకారం విజయదశమి నాడు రిలీజ్ అయిన యమగోల సూపర్ డూపర్ హిట్ అయింది.
40ప్రింట్లతో రిలీజ్ చేసిన ఈమూవీ అన్నిచోట్లా 80రోజులు దాటి ఆడింది. 28సెంటర్స్ లో 100ఆడింది. 90రోజులకు కోటి రూపాయలు వసూలు చేసిన నాల్గవ చిత్రంగా నిల్చింది. అడవిరాముడు తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.అదేసమయంలో కనీవినీ ఎరుగని తుపాన్ భీభత్సంతో రాష్త్రం అల్లాడిపోయింది. అయినా సినిమాకు ఆదరణ తగ్గలేదు.
ఎన్టీఆర్ జోలె పట్టి, నాటక ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు వసూలు చేసి వరద బాధితుల సహాయార్ధం ప్రభుత్వానికి అందజేశారు. యమగోల సిల్వర్ జూబ్లీకి షీల్డ్స్ కాకుండా బంగారు గొలుసులు, ఉంగరాలు జ్ఞాపికగా ఇచ్చి నిర్మాత వెంకట రత్నం కొత్త సంప్రదాయం నెలకొల్పారు. యముడిగా సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య, రుద్రయ్యగా రావు గోపాలరావు, తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. అడవిరాముడు తరవాత యమగోల ఈ రెండు వరుసగా ఎన్టీఆర్, జయప్రద కాంబోలో జనం బ్రహ్మరధం పట్టారు.

