కర్తవ్యం సినిమా వెనక ఉన్న నమ్మలేని నిజాలు మీకోసమే
karthavyam telugu full movie:పవర్ ఫుల్ లేడీ గెటప్ లో అదరగొట్టి, లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన vijayashanthi నటజీవితాన్ని మలుపు తిప్పిన సినిమా కర్తవ్యం. జాతీయ పురస్కారం తెచ్చిపెట్టింది. ఎప్పటినుంచో ఇలాంటి పాత్రకోసం కథ రాయమని విజయశాంతి పర్సనల్ మేకప్ మ్యాన్ ఏ ఎం రత్నం తరచూ పరుచూరి బ్రదర్స్ ని అడగడం, డైరెక్టర్ ఏ మోహన్ గాంధీ కూడా తాను డైరెక్ట్ చేస్తానని చెబుతూ , అప్పటికే ఇండియాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో రాణిస్తున్న కిరణ్ బేడీ స్పూర్తితో కథ రాయమని సూచించారు.
దాంతో 1989నాటికీ ఓ కథ రెడీ అయింది. ఇది విజయశాంతి చేయలేకపోతే, హీరోని ఆ పాత్రలో పెట్టేద్దాం అని పరుచూరి సోదరులు అన్నారట. అయితే ఏ ఎం రత్నం నిర్మాతగా చేయడానికి సిద్ధమవ్వడం, విజయశాంతి ఈ ఛాలెంజ్ రోల్ చేయడానికి ఒకే చెప్పడంతో సపోర్టింగ్ రోల్ లో హీరో కోసం వెదికారు.
మోహన్ బాబుని కూడా అడిగిన పనవ్వకపోవడంతో హీరో వినోద్ కుమార్ ఒకే చెప్పాడు. ఇక విలన్ కోసం పరుచూరి గోపాలకృష్ణను అడిగితె లేదన్నారు. దాంతో అట్లూరి పుండరీకాక్షయ్యను తీసుకున్నారు. అలాగే విలన్ గ్యాంగ్ లో రవితేజ కు ఛాన్స్ రావడంతో అదే తెరమీద కనిపించిన తొలిచిత్రం అయింది.
అపుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎదిగిన మీనాను మరోకీలక పాత్రకు తీసుకున్నారు. నవంబర్ 2న షూటింగ్ స్టార్ట్. కిరణ్ బేడీ క్లాప్ కొత్తగా, విశాఖ, మద్రాసులలో షూటింగ్ పూర్తి చేసారు. విజయశాంతి రెమ్యునరేషన్ కాకుండా 50లక్షల బడ్జెట్ తో 52 పనిదినాల్లో షూటింగ్ పూర్తి. ఎడిటింగ్ లేటయింది. 1990 జూన్ 29 రిలీజ్ డేట్. కానీ బయ్యర్లు ఎవ్వరూ రాలేదు.
దాంతో ఏ ఎం రత్నం స్వయంగా రిలీజ్ చేసారు. అదే సమయంలో జగదేక వీరుడు అతిలోక సుందరి 50 డేస్ పూర్తయి, ఇంకా దూసుకెళ్తోంది. కర్తవ్యం తట్టుకుని నిలబడుతుందా అని అందరూ అన్నారు. ఇలాంటి సినిమాలు స్టార్ హీరోలు యాక్ట్ చేసినవి చాలా వచ్చినా లేడి చేయడంతో కొత్తగా అన్పించింది. అందుకే ప్రభంజనం సృష్టించింది.
పవర్ ఫుల్ పోలీసాఫీసర్ కాళ్ళు పోగొట్టుకోవడం, మళ్ళీ పట్టుదలగా పుంజుకోవడం, అప్పటికే కాళ్ళు పోగొట్టుకున్న నూతన ప్రసాద్ ఇందులో నటించడం యాదృచ్ఛికం. సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ హిట్. స్టార్ హీరోలంతా విజయశాంతి వైపు చూసేలా చేసింది. లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ లాంటి బిరుదులు వచ్చాయి. ఇక ఆమె రెమ్యునరేషన్ 50లక్షలకు చేరింది. పుండరీకాక్షయ్యలో వెరైటీ విలనిజం పండింది. మొత్తం 3కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. లేట్ రిలీజ్ లతో కల్సి 40సెంటర్స్ లో 50రోజులు,19సెంటర్స్ లో 100డేస్.