MoviesTollywood news in telugu

ఎన్టీఆర్ సినీ కెరీర్ లో 1977 ప్రత్యేకత ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

1977 is very special ntr :సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్, అక్కినేని రెండు కళ్ళు అని చెబుతారు. ఇందులో ఎన్టీఆర్ పౌరాణిక, జానపద, సాంఘిక, హిస్టారికల్ పాత్రలతో మెప్పించి తిరుగులేని నటుడిగా మహానటుడయ్యారు. మరోపక్క రాజకీయాల్లో చేరి ప్రభంజనం సృష్టించి మహానాయకుడిగా నిలిచారు. ఇటు సినిమా, అటు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఎన్టీఆర్ కోట్లాదిమంది అభిమానులకు ఆరాధ్యదైవం.

పౌరాణిక సినిమాలతో దూసుకెళ్లిన ఎన్టీఆర్, ఆతర్వాత కాలంలో కృష్ణ, శోభన్ బాబు వంటివాళ్ళు రావడంతో కొంచెం జోరు తగ్గింది. అయితే 1977లో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. ఇండస్ట్రీతో పాటు సినీ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. జనవరి 18న రిలీజైన దానవీర సూరా కర్ణ బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో ఏకంగా మూడు విభిన్న పాత్రలు పోషించి ఔరా అనిపించారు.

ఈ సినిమా విజయం మరిచిపోకముందే కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అడవిరాముడు బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక అదే ఏడాది చివరిలో యమగోల రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇలా ఒకే ఏడాది మూడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఘటన ఎన్టీఆర్ సొంతం. తెలుగు ఇండస్ట్రీలో ఇదొక రికార్డుగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."