MoviesTollywood news in telugu

తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు సంపాదించిన సినిమాలు ఎన్ని ?

low budget movies :స్టార్ హీరోలతో రాని విజయాలు చిన్న సినిమాలతో అద్భుతాలు వస్తాయి. కలెక్షన్స్ వర్షం కూడా వస్తుంది. టాలీవుడ్ లో ఇలాంటివెన్నో ఉన్నాయి. అందులో ఈ మధ్య వచ్చిన కొన్ని ప్రస్తావిస్తే, పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం ఏకంగా 70కోట్లు కలెక్ట్ చేసింది. ఖర్చు చూస్తే 15కోట్లే కావడంతో భారీగా లాభాలు తెచ్చింది.
geetha govindham movie
వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన తెలంగాణ యాస ప్రేమ కథ ఫిదా మూవీ ని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించాడు. 18కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తే, 48కోట్లు షేర్ కలెక్ట్ చేసి భారీగానే లాభాలు తెచ్చింది.రామ్ తో పూరి జగన్నాధ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ 17కోట్లు ప్రీరిలీజ్ చేస్తే, 19కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మీద 25కోట్లు లాభాలు తెచ్చింది.

విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రి హీరోని చేసిన అర్జున్ రెడ్డి5కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేయగా, ఫుల్ రన్ లో 25కోట్లు కలెక్ట్ చేసింది. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కల్సి నటించిన మజిలీ మూవీ 39కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 19కోట్ల పైగా లాభాలు తెచ్చింది. అప్పటివరకూ స్టార్ హీరోలతో చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చిన్న హీరోతో చేసిన మూవీ ఆ ఆ లో నితిన్, సమంత నటించారు. 20కోట్ల పైగా లాభాలు సొంతం చేసుకుంది.

హీరో నానిని నేచురల్ స్టార్ చేసిన భలే భలే మగాడివోయ్ మూవీ 19కోట్ల లాభాలు ఆరోజుల్లో తెచ్చింది. 7.9కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈమూవీ 25కోట్ల పైనే వసూలు చేసింది. మారుతి డైరెక్ట్ చేసిన ప్రతిరోజూ పండగే మూవీ సాయిధరమ్ తేజ్ కి మంచి హిట్ ఇచ్చింది. 35కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది.
ismart shankar full movie
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన శతమానం భవతి మూవీ 15కోట్ల లాభం తెచ్చి, నేషనల్ అవార్డు కూడా తీసుకొచ్చింది. 34కోట్లు వసూలు చేసింది. నాని హీరోగా నటించగా , త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన నేను లోకల్ మూవీ లో14.6కోట్ల లాభం తెచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."