నీహారిక జీవితంలో తీసుకున్న 5 తెలివైన నిర్ణయాలు
Niharika konidela Facts :మెగా ఫ్యామిలీ అనగానే ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి. స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరు తన తర్వాత తరం వారికి పూలబాట వేశారు. అందుకే దాదాపు 10మంది వరకూ మెగా కాంపౌండ్ నుంచి వచ్చారు. అయితే అందరూ మగవాళ్లే కాగా, మెగా డాటర్ నిహారిక ఒక్కర్తే ఆడవాళ్ళ జాబితాలో ఇండస్ట్రీకి వచ్చి, రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఎంతటి మెగా డాటర్ కి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిని ఆమె ఎలా ఎదుర్కొందో పరిశీలిద్దాం.
నాగబాబు, పద్మజ దంపతులకు 1993డిసెంబర్ 18న నిహారిక హైదరాబాద్ లో జన్మించింది. ఈమెకు వరుణ్ తేజ్ అనే అన్నయ్య ఉన్నాడు. నాగబాబుకే కాదు, ఇద్దరు కూతుళ్ళున్న చిరంజీవికి కూడా నిహారిక అంటే ఎంతో అభిమానం. బాబాయ్ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా గారభమే. అయితే ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు వచ్చినపుడు, ఏమాత్రం కంగారుపడలేదు పైగా తండ్రికి ధైర్యం నూరిపోసింది. నిహారిక వల్లే ఆత్మహత్య విరమించుకున్నానని, ఆమె తన ధైర్యమని నాగబాబు ఓపెన్ గా కూడా చెప్పారు.
ఫిలిం కోర్సుకి ఫారిన్ వెళ్లాల్సిన సమయంలో , తండ్రిని బుల్లితెరమీద ఎంట్రీ ఇవ్వడంతో , తాను కూడా ఢీ డాన్స్ షోతో బుల్లితెరమీదికి నిహారిక వచ్చింది. అలా ఇంట్లో బాధ్యతలు పంచుకుంది. ఇక ఆర్ధిక ఇబ్బందులు గట్టెక్కడంతో వెబ్ సిరీస్ లో నటించడం స్టార్ట్ చేసింది. వెండితెరమీద కూడా మెరిసింది. ఆమె మూవీస్ కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఫాన్స్ తనను నటిగా చూడ్డం లేదని గ్రహించి సినీ ప్రయాణం అక్కడితో ఆపేసింది. ఇక ఆమె గురించి పుకార్లు వచ్చినా తేలిగ్గా తీసుకుంది. పెద్దల మాటకు గౌరవం ఇస్తూ వాళ్ళు చూసిన సంబంధాన్ని ఒప్పుకుంది. అలా పేరెంట్స్ కి ఆనందం మిగిల్చి , సెటిల్ అయింది.

