MoviesTollywood news in telugu

చివరిదశలో దుర్భర పరిస్థితులు చూసిన స్టార్స్

Veteran Actresses Passed Away :సినిమా వాళ్ళ జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఉండవని అనేక ఘటనలు రుజువుచేస్తున్నాయి. ఒకప్పుడు స్టేటస్ అనుభవించి చివరిదశలో దుర్భర పరిస్థితులు చవిచూసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలాంటి గడ్డు స్థితిని ఎదుర్కొన్న వాళ్ళ వివరాల్లోకి వెళ్తే, బాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ పర్వీన్ బాబీ అనుకోకుండా మానసిక స్థితి దెబ్బతిని, అమెరికా ఆసుపత్రిలో చాలారోజులు ఉన్నారు. చివరకి ఆమె ఒంటరిగానే 2005లో మరణించారు. గాలికి గాయం కావడంతో నడవలేని స్థితిలో ఆమె మరణించగా, మూడు రోజుల తర్వాత మృతదేహాన్ని అపార్ట్ మెంట్ లో స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం లో ఆమె రెండు రోజులుగా ఏమీ తినలేదని తేలింది.

ఇక సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మహానటి సావిత్రి అప్పట్లో ఎన్టీఆర్ , అక్కినేని లను మించిన స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. సంపాదన కూడా అలానే ఉండేది. దానాలు ఎన్నో చేసారు. నమ్మిన వాళ్ళు మోసం చేసారు. దాంతో చివరి దశలో కోమాలోకి వెళ్లిపోయారు. 9నెలలు కొమాలో గడిపి 1981లో మరణించారు. ఇక తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న మీనాకుమారి చివరి రోజుల్లో హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. మద్యానికి బానిసగా మారడంతో లివర్ పూర్తిగా చెడిపోయింది. ఇక శృంగార తారగా వెలుగొందిన స్మిత ఆత్మహత్య చేసుకుని మరణించింది.

బాలీవుడ్ హీరో గురుదత్ భార్యతో విబేధాలు,ఒంటరితనం తో కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీనియర్ నటి అర్చన సచ్ దేవ్ అమెరికాలో కొడుకు, ముంబయిలో కూతురు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యధచెంది దయనీయ స్థితిలో మరణించింది. శేఖర్ హంగల్ కూడా చివరి దశలో ఆసుపత్రి బిల్స్ కూడా కట్టలేని దుస్థితిలో మరణించారు. నటుడు భరత్ భూషణ్ జీవితం కూడా విషాదమే. కోట్ల ఆస్థి సంపాదించినా జూదం,వ్యసనం వలన అన్నీ కోల్పోయారు. ఇక నటుడు భగవాన్ దాదా విలాసవంతమైన బంగ్లాలో గడిపారు. కానీ చివరిరోజుల్లో అవేమీ అయన దగ్గర లేవు. ఒంటరిగా కన్నుమూశారు.