Healthhealth tips in telugu

మతిమరుపును(Memory Loss Tips) పోగొట్టే సులభమైన చిట్కా

Memory Loss Tips :సాధారణంగా మనకి మతిమరుపు అనగానే టక్కున గుర్తొచ్చేది గజిని. 15 నిమిషాలకోసారి మరచిపోయే పాత్రలో నటించిన సూర్య అంతలా ఆకట్టుకున్నాడు. గజిని నుండి గత ఏడాది వచ్చిన బలే బలే మగాడివోయ్ వరకు… ఇలా మతిమరుపు అనే కాన్సెప్ట్ తో ఎన్నో చిత్రాలు వచ్చాయి.

నిజానికి కొందరు మతిమరుపు అనేది గొప్ప వరం అంటారు… ఇంకొందరు దీనిని మించిన శాపం ఉండదు అంటారు. ఏది ఏమైనా ఇది కూడా ఓక ఆరోగ్య సమస్యే. ముఖ్యంగా ఈ కాలంలో షార్ట్-టర్మ్ మెమరీ లాస్ అనేది ఎక్కువవుతుంది. ఒక గ్రాము పసుపుతో ఈ సమస్య కి స్వస్తి పలకచ్చంటున్నారు డాక్టర్లు.

ఆస్ట్రేలియా కు చెందిన మొనాష్ యూనివర్సిటీ లోని పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం కేవలం ఒక్క గ్రాము పసుపు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్నవారికి గొప్ప వరంలా మారుతుందని తేలింది. 60 ఎల్లి దాటిన కొందరిపై ఈ అధ్యయనం నిర్వహించారు. రెండు గ్రూపులుగా విడదీసి.. మొదటి గ్రూప్ కి రోజు పొద్దున్న వారు తినే ఆహారంలో 1 గరం పసుపు వేసి ఇచ్చారట.

మరో గ్రూప్ కి సాధారణ ఆహారాన్ని ఇచ్చారట. కొన్ని రోజుల తరువాత.. రోజు పసుపు తిన్న వారి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తగ్గిందని తేలింది. ఇదే కాకుండా వీరిలో ప్రాబ్లంని సాల్వ్ చేసే గుణం కూడా పెరిగినట్టు పరిశోధకులు తెలిపారు.

పసుపులో ఎన్నో అధ్బుతమైన ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. కేవలం కూరలలో కాకుండా.. పొద్దున తినే ఆహారంలో కూడా ఒక గ్రాము పసుపు వేసుకొని తింటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."