ఢీ షో యాంకర్ దీపిక గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

Dhee Show Deepika Pilli :చైనాతో ఈమధ్య కాలంలో ఘర్షణ జరగనంతవరకూ ఇండియాలో టిక్ టాక్ చేసిన హడావిడి మాములుగా లేదు. ఎవరి రేంజ్ లో వాళ్ళు టిక్ టాక్ లో దూసుకు పోయారు. మరికొందరు రెచ్చిపోయారు. టిక్ టాక్ ద్వారా తమ టాలెంట్ ని బయట పెట్టినవాళ్లను మీడియా వాళ్ళు కూడా గుర్తించి ఫోకస్ చేసారు. దీంతో టాలెంట్ ఉన్నవాళ్లు ఛాన్స్ లు కూడా అందిపుచ్చుకున్నారు. అందులో దీపికా పిల్లి ఒకరు. ఇప్పుడు టిక్ టాక్ తో సహా చాలా వరకూ చైనా యాప్ లు నిషేధానికి గురయ్యాయి.

అయితే దీపికా తన టిక్ టాక్ వీడియోలతో ఆకట్టుకుని, ఈటివి డాన్స్ షోలో యాంకర్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈమె బ్యాక్ గ్రౌండ్ లోకి వెళ్తే, 1999ఏప్రియల్ 15న విజయవాడలో పుట్టిన ఈమె స్టడీస్ అక్కడే పూర్తిచేసింది. చిన్న నాటినుంచి చిలిపి చేష్టలతో , పక్కవాళ్ళను ఆటపట్టిస్తూ ఉండేది. టివి షోలు, సినిమాలు విపరీతంగా చూసేది. వినోద రంగంలో నిలదొక్కుకోవాలన్న కోరిక ఉండేది. అనుకున్నట్టే ఢీ 13షో దాకా దూసుకొచ్చేసింది. తండ్రి అంటే చాలా ఇష్టమట. రోడ్డు సైడ్ ఫుడ్ తినడం కూడా ఈమెకు భలే ఇష్టం. పెట్స్ అంటే కూడా ఇష్టం.

దీపికా కు షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే చాలా ఇష్టమట. 21ఏళ్ళ దీపికా ప్రస్తుతం రేవంత్ పుట్టగంటి అనే అబ్బాయితో ప్రేమలో ఉందని టాక్. ఈమె అప్ లోడ్ చేసే వీడియోలు ఎక్కువ ఇతడితోనే ఉండడం ఇందుకు కారణం. తన టిక్ టాక్ వీడియోలతో తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా ఈమె నవ్వు, డాన్స్ లతో కుర్రకారుని ఫిదా చేసింది. ఈమె వీడియోలకు 75లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారంటే దీపికా రేంజ్ ఏమిటో చెప్పక్కర్లేదు. అంతేకాదు, సెలబ్రిటీ లెవెల్లో ఇంస్టాగ్రామ్ లో 8లక్షల 40వేల ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. 2019నుంచి సోషల్ మీడియా ద్వారా ఏడాదికి 3లక్షల వరకూ సంపాదిస్తూ వచ్చింది. ప్రస్తుతం 15లక్షలు నెట్ వర్త్ ఉంటుందని అంచనా.