MoviesTollywood news in telugu

తారక్ షూస్ రేటు తెలిస్తే షాకవ్వాల్సిందే…ఎంతంటే…?

NTR Shoes :టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలు కార్లు, బైక్స్, వాచీలు, డ్రెస్ లకు విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తాగే వాటర్ బాటిల్ ఖరీదు వేలల్లో ఉంటుందని టాక్. అలాగే కింగ్ నాగార్జున వేసుకునే డ్రెస్ లక్షలలో ఉంటుందని అంటారు. మెగాస్టార్ చిరంజీవి చేతికి ఉన్న వాచ్ ఖరీదుతో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీ గా జీవించేయొచ్చని అంటుంటారు. ఈమేరకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడం తెలిసిందే.

మన హీరోల బ్రాండింగ్ వేల్యూ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా ఉంటూ తమ బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేసుకోవడంలో దిట్ట. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. తన కొడుకులతో చెప్పించిన క్రిస్మస్ శుభాకాంక్షల ఫోటోలు రెండు రోజులు ట్రెండ్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తారక్ వేసుకున్న ఓ షూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆయన వేసుకున్న షూస్ గురించి అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు. HERMES బ్రాండ్ షూస్ రేట్ తెలిస్తే నిజంగా షాకవుతారు. అక్షరాలా వాటి ఖరీదు దాదాపు 80 వేలకు పైగానే ఉంటుందట. ఎందుకంటే, అవి షూస్ మాదిరి కాకుండా లోఫర్స్‌లా ఉన్నాయి. వీటి రేంజ్ ఇది అంటూ తారక్ ఫ్యాన్స్ కొందరు ఈ షూ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."