Healthhealth tips in telugu

కరోనా వ్యాక్సిన్ అంటూ రిజిస్ట్రేషన్ ఫోన్ వస్తోందా…జాగ్రత్తగా ఉండండి

corona vaccine :కరోనా వ్యాక్సిన్ ఈ సంవత్సరంలో విడుదల చేయాలని అనేక ప్రముఖ సంస్థలు రెడీగా ఉన్నాయి. అనేక దేశాలు కూడా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాలని కసరత్తులు బాగానే చేస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయమని, అలా చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయని సూచనలను చేస్తుంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ పొందేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఆ వార్తలను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలు చేయటానికి సిద్దం అయ్యిపోయారు. కరోనా వ్యాక్సిన్ కావాలనుకున్నవారు త్వరగా తమ ఆధార్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్, ఫోన్ నెంబరు కు వచ్చే ఓటీపీ ఇవ్వాలని సైబర్ నేరగాళ్లు అడుగుతున్నారు.కొంత మండి అమాయకులు వారు అడిగిన సమాచారం ఇచ్చేస్తున్నారు. అలా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాయం అయ్యిపోతున్నాయి.

బ్యాంకు డీటెయిల్స్ ఎవ్వరికి ఇవ్వకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా కొంత మండి నిర్లక్ష్యంగా అపరిచితులకు సమాచారం ఇచ్చేస్తున్నారు. అలా ఇచ్చి మోసపోతున్నారు. కరోనా వ్యాక్సిన్ ట్రాప్ లో పడి నష్టపోయిన బాధితులు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించగా వారు మిగిలిన ప్రజలను అప్రమత్తం చేశారు. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పితే అది మోసమని గ్రహించాలని చెప్పుతు ఏమైనా అనుమానం వస్తే మాత్రం వెంటనే 100 కి డయల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలని ఆయన అన్నారు.